News November 22, 2024
హ్యాట్సాఫ్: 104మంది పిల్లల్ని కాపాడిన ఇద్దరు పోలీసులు
ఢిల్లీకి చెందిన సీమా దేవి, సుమన్ హుడా మానవ రవాణా నిరోధక శాఖలో పనిచేస్తున్నారు. గడచిన 9 నెలల్లో అపహరణకు గురైన 104మంది పిల్లల్ని వీరు రక్షించారు. విధి నిర్వహణలో భాగంగా ఇతర రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్ని కూడా జల్లెడ పట్టారు. ఎన్నో సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వెనక్కితగ్గలేదు. ఇతరుల సంతోషం కోసం తమ బిడ్డలకు దూరమై పనిచేస్తున్న ఈ ధీర వనితలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News November 23, 2024
పుష్ప-2 నుంచి ‘కిస్సిక్’ టీజర్.. ఎప్పుడంటే..
పుష్ప-2 నుంచి కిస్సిక్ సాంగ్ ఈ నెల 24న సాయంత్రం 7.02 గంటలకు విడుదల కానుంది. అంతకంటే ముందు మూవీ టీమ్ ఆడియన్స్‌కు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. రేపు ఉదయం 10.08 గంటలకు సాంగ్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటలో అల్లు అర్జున్ సరసన శ్రీలీల డాన్స్ చేశారు.
News November 23, 2024
తెలంగాణలో 13 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలకు పర్మిషన్
తెలంగాణలో 13 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా 13 గవర్నమెంట్ నర్సింగ్ కళాశాలలు రానున్నాయి. ఒక్కో కాలేజీకి 60 మంది విద్యార్థులను తీసుకోనున్నారు. జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, నిర్మల్, రామగుండం, మెదక్, కుత్బుల్లాపూర్, ములుగు, నారాయణపేట, మహేశ్వరం, నర్సంపేట, భువనగిరిలో కాలేజీలు ఏర్పాటుకానున్నాయి.
News November 23, 2024
చలి పులి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రంగా పెరిగిపోయింది. ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సరిపడా నీరు, పౌష్ఠికాహారం తీసుకోవాలి. జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. విటమిన్ C ఉండే ఫుడ్ తీసుకోవాలి. చలి మంట కోసం ఇంట్లో కర్రలు కాల్చకూడదు. ఇలా చేస్తే కార్బన్ మోనాక్సైడ్ పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.