News June 24, 2024

మంచిరోజులొస్తాయి.. భయపడొద్దు: వైఎస్ జగన్

image

AP: పులివెందులలో తనను కలిసిన వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. మళ్లీ మంచిరోజులొస్తాయని వారితో అన్నారు. ‘నేను మళ్లీ ప్రజల్లోకి వస్తా. అందరికీ అండగా ఉంటా. రాబోయే రోజులు మనవే’ అని భరోసా ఇచ్చారు. కాగా.. పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ నుంచి కాంట్రాక్టర్లకు రూ.100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ ఉంటే తనకెందుకు చెప్పలేదంటూ సన్నిహితులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Similar News

News January 3, 2025

నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు

image

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఘటనకు, అల్లు అర్జున్‌కు సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

News January 3, 2025

రైలు పట్టాలపై పబ్‌జీ.. ముగ్గురు యువకుల మ‌ృతి

image

పబ్‌జీ ఆట పిచ్చి బిహార్‌లో ముగ్గురు టీనేజీ యువకుల ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు మాన్సా తోలా ప్రాంతంలో రైలుపట్టాలపై పబ్‌జీ ఆడుతున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు. వారిపైనుంచి రైలు వెళ్లిపోయింది. దీంతో అందరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

News January 3, 2025

ప్రభుత్వం సంచలన నిర్ణయం?

image

TG: సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 24 రోజులుగా వారు విధులకు రాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. వారిని క్రమబద్ధీకరించడం లేదా విద్యాశాఖలో విలీనం చేయడం న్యాయపరంగా కుదరదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. విధులకు హాజరుకాకుండా సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.