News October 21, 2024
ఎక్కువ మంది పిల్లలను కనాలా?

సంతానోత్పత్తి పెరగాలన్న ఏపీ, తమిళనాడు CMల వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. AP సంతానోత్పత్తి రేటు అవసరమైన 2.1 కంటే తక్కువగా 1.7గా ఉంది. ఇదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా భారీగా పెరిగింది. లోక్‌సభ స్థానాల పునర్విభజనలో జనాభా పెరుగుదలను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. జపాన్ లాగా వృద్ధుల సంఖ్య పెరిగి, యువత సంఖ్య తగ్గే అవకాశమూ ఉందంటున్నారు.
Similar News
News January 12, 2026
ADB: రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా జమునా నాయక్

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని దానోరా (బి) సర్పంచ్ జాదవ్ జమునా నాయక్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సర్పంచుల సంఘం బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. క్రమశిక్షణతో పాటు రాష్ట్ర అభివృద్ధికై తోడ్పాటు చేస్తానని జమునా నాయక్ పేర్కొన్నారు.
News January 12, 2026
డీఏపై జీవో విడుదల

TG: ప్రభుత్వ ఉద్యోగుల <<18837053>>డీఏ 3.64%<<>> పెంచుతూ సర్కారు జీవో విడుదల చేసింది. 2023 జులై 1 నుంచి ఇది వర్తించనుంది. పెరిగిన డీఏ జనవరి నెల వేతనంతో కలిపి ఫిబ్రవరి 1న చెల్లించనున్నారు. 2023 జులై 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు డీఏ బకాయిలు GPF ఖాతాలో జమ చేయనున్నారు. మున్సిపాలిటీ ఉద్యోగుల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకు అందరి జీతాలు పెరగనున్నాయి.
News January 12, 2026
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డులు విడుదల

ఆలిండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. వాటిని <


