News November 15, 2024
SBI హౌస్ లోన్ తీసుకున్నారా?

SBI మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR)ను 5 బేసిస్ పాయింట్ల(0.05 శాతం) మేర పెంచింది. దీంతో హౌస్ లోన్ వంటి దీర్ఘకాలిక రుణాలకు సంబంధించిన ఏడాది కాల వ్యవధి MCLR 9 శాతానికి చేరింది. అలాగే 3, 6 నెలల రుణ రేట్లను అదే మేర పెంచింది. అయితే ఓవర్‌నైట్, నెల, రెండేళ్లు, మూడేళ్ల MCLR రేట్లను సవరించలేదు. పెరిగిన రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని SBI ప్రకటించింది.
Similar News
News February 19, 2026
ఇంటర్వ్యూతో IICTలో ఉద్యోగాలు

<
News February 19, 2026
BREAKING: రాష్ట్రంలో భూకంపం

AP: పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20km దూరంలో, భూమికి 10km లోతులో కేంద్రం ఉన్నట్లు EMSC, NCS ధ్రువీకరించాయి. వినుకొండ, దర్శి ప్రాంతాల్లోనూ ప్రకంపనల వల్ల వస్తువులు కదిలి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అయితే, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
News February 19, 2026
కాపర్ టీ వాడుతున్నారా?

అవాంఛిత గర్భధారణను నివారించడానికి చాలామంది మహిళలు కాపర్ టీ వాడతారు. అయితే దీన్ని సరిగ్గా ప్లేస్ చేయకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కలయిక సమయంలో నొప్పి, రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, కొన్నిసార్లు గర్భాశయ లైనింగ్ గాయపడటం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో దాన్ని తొలగించుకోవాలని సూచిస్తున్నారు.


