News May 11, 2024

ఈ విద్యా సంస్కరణలు గతంలో ఎప్పుడైనా జరిగాయా?: సీఎం జగన్

image

AP: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చామని CM జగన్ తెలిపారు. కైకలూరు సభలో మాట్లాడుతూ.. ‘3వ తరగతి నుంచి టోఫెల్, 6th క్లాస్ నుంచి డిజిటల్ బోధన, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించాం. IB సిలబస్‌నూ తీసుకొచ్చాం. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేశాం. ఇంటర్నేషనల్ వర్సిటీలతో సర్టిఫైడ్ కోర్సులు అమలు చేస్తున్నాం. ఈ విద్యా సంస్కరణలు గతంలో ఎప్పుడైనా జరిగాయా?’ అని ప్రశ్నించారు.

Similar News

News January 28, 2026

రేపు మామునూర్ ఎయిర్‌పోర్ట్ భూముల అప్పగింత

image

వరంగల్ ప్రజల దశాబ్దాల కల అయిన మామునూరు విమానాశ్రయ పనులు కీలక దశకు చేరుకున్నాయి. విమానాశ్రయ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం సేకరించిన 260 ఎకరాల భూమికి సంబంధించిన అధికారిక పత్రాలను వరంగల్ కలెక్టర్ సత్య శారద గురువారం హైదరాబాద్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అందజేయనున్నారు.

News January 28, 2026

అజిత్ మరణం వెనుక కుట్ర లేదు: శరద్ పవార్

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదని ఎన్సీపీ అధినేత, ఆయన పెద్దనాన్న శరద్ పవార్ స్పష్టం చేశారు. ఈ ప్రమాదాన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని సూచించారు. ఇది పూర్తిగా ఓ యాక్సిడెంట్ అని పేర్కొన్నారు. కాగా అజిత్ మరణంలో కుట్ర కోణం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News January 28, 2026

అజిత్ పవార్ మృతి.. 3 రోజులు సంతాప దినాలు

image

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. దీంతో 3 రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు బంద్ కానున్నాయి. రేపు 11amకు పవర్ అంత్యక్రియలు నిర్వహించనుండగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. మరోవైపు అజిత్ మృతదేహం ఉన్న బారామతి ఆస్పత్రి వద్దకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు.