News September 20, 2025
వీటిని ఎక్కువ రోజులు వాడుతున్నారా?

మనం రోజూ వాడే వస్తువులను నిర్దిష్ట సమయంలో మార్చేయాలనే విషయం మీకు తెలుసా? టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడకుండా 3 నెలలకోసారి మార్చడం మేలని నిపుణులు చెబుతున్నారు. అలాగే లోదుస్తులను 6-12 నెలలకు ఓసారి, చీపురుని 1-2 ఏళ్లకోసారి, పరుపుని 7-10ఏళ్లకు ఒకసారి మార్చాలట. దిండును రెండేళ్లకు, సన్‌స్క్రీన్ 12 నెలలకు, కిచెన్ స్పాంజ్‌ను రెండు వారాలకు ఒకసారి మార్చడం శ్రేయస్కరం అని సూచిస్తున్నారు. SHARE IT
Similar News
News September 20, 2025
వచ్చే నెల నుంచి పత్తి కొనుగోళ్లు.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

TG: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లను వచ్చే నెల నుంచి ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 122 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులందరికీ మద్దతు ధర(దూది పింజ పత్తికి క్వింటాకు ₹8,110, తక్కువ దూది పింజ ఉంటే ₹7,710) లభించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 18005995779, వాట్సాప్ నంబర్ 8897281111లను సంప్రదించాలన్నారు.
News September 20, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 పెరిగి రూ.1,12,150కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.750 ఎగబాకి రూ.1,02,800 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2000 పెరిగి రూ.1,45,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 20, 2025
దుర్గమ్మ సన్నిధిలో ఉచితంగా లడ్డూ ప్రసాదం

AP: దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మూలా నక్షత్రం, దశమి రోజుల్లో భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. అలాగే టికెట్లు లేకుండా దర్శనం కల్పించడంతో పాటు దర్శన సమయాన్ని 22 గంటలకు పెంచింది. పంచ హారతిలో ప్రముఖుల ప్రత్యేక దర్శనాల రద్దు, అంతరాలయ దర్శనాల నిలిపివేత, రూ.500 టికెట్లు రద్దు వంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు.