News January 23, 2025

అభిషేక్ శర్మ బాల్ ఎక్సర్‌సైజ్ గమనించారా?

image

కోల్‌కతాలో జరిగిన తొలి T20లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఊచకోత కోశాడు. 34బంతుల్లోనే 8 సిక్సులు, 5 ఫోర్లతో 79 పరుగులు చేసి భారత్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. కాగా, బ్యాటింగ్‌కు రావడానికి ముందు అభిషేక్ బంతితో చేసిన ఎక్సర్‌సైజ్ SMలో వైరల్‌గా మారింది. బంతి సీమ్‌ను వివిధ పొజిషన్లలో చూస్తూ చేసిన ఈ ప్రాక్టీస్ బ్యాటింగ్ చేసే సమయంలో ఊపయోగపడింది. మ్యాచ్‌లో ఈ బాల్ ఎక్సర్‌సైజ్ గమనించి ఉంటే COMMENT చేయండి.

Similar News

News November 23, 2025

పోలీసులకు సవాల్‌ విసురుతున్న MovieRulz

image

పైరసీ మాఫియా టాలీవుడ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. iBOMMA, Bappam TV లాంటి సైట్లు బ్లాక్ చేసినా, MovieRulz మాత్రం తన దారులు మార్చుకుంటూ కొనసాగుతోంది. శుక్రవారం విడుదలైన సినిమాలు ఒక్కరోజు కూడా గడవక ముందే మూవీ రూల్జ్‌లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్‌లో కెమెరాతో రికార్డ్ చేసిన ప్రింట్‌లను అప్‌లోడ్ చేశారు. ఇప్పటికే iBOMMA రవిపై పోలీసులు విచారణను వేగవంతం చేసినప్పటికీ MovieRulz మాత్రం సవాల్ విసురుతోంది.

News November 23, 2025

నాగచైతన్య కొత్త మూవీ టైటిల్ వచ్చేసింది

image

అక్కినేని నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రివీల్ చేశారు. ‘వృషకర్మ’ టైటిల్‌తో నాగచైతన్య యాంగ్రీ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను Xలో పోస్ట్ చేశారు. చైతూకి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ సాలిడ్‌గా ఉందని మహేశ్ పేర్కొన్నారు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News November 23, 2025

బోస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>జేసీ<<>> బోస్ ఇన్‌స్టిట్యూట్‌ 13 డఫ్ట్రీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎనిమిదో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://jcbose.ac.in/