News March 12, 2025

పబ్లిక్ ప్లేసెస్‌లో ఈ టైల్స్‌ను గమనించారా?

image

రైల్వే & మెట్రో స్టేషన్లు, బస్టాండ్స్, ఫుట్‌పాత్, ఆసుపత్రులు వంటి పబ్లిక్ ప్లేసెస్‌లో పసుపు రంగులో ఉండే స్పెషల్ టైల్స్‌ కనిపిస్తుంటాయి. ఇవి అక్కడ ఎందుకున్నాయో తెలుసా? వీటిని జపాన్ వ్యక్తి సెయీచీ మియాకే తన బ్లైండ్ ఫ్రెండ్ కోసం డిజైన్ చేయగా ఇప్పుడు ప్రపంచమంతా వినియోగిస్తున్నారు. ఈ టైల్స్‌లో డాట్స్ & స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. లైన్స్ ఉంటే ముందుకు వెళ్లొచ్చని, డాట్స్ ఉంటే జాగ్రత్తగా ఉండాలని అర్థం.

Similar News

News March 12, 2025

మారనున్న KBC హోస్ట్‌!

image

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ హోస్ట్‌గా చేస్తోన్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ సీజన్ నుంచి వైదొలిగే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. దీంతో తర్వాతి హోస్ట్ ఎవరనే చర్చ మొదలైంది. ఆయన స్థానంలో బాలీవుడ్ నటీనటులు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీలలో ఒకరిని నియమిస్తారని సమాచారం. 2007 KBCలో షారుఖ్ హోస్ట్‌గా చేసిన విషయం తెలిసిందే. ఎవరిని నియమిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.

News March 12, 2025

క్రికెటర్స్ కమ్ రెస్టారెంట్ ఓనర్స్!

image

టీమ్ఇండియా తరఫున ఆడిన కొందరు భారత క్రికెటర్లకు సొంతంగా రెస్టారెంట్ బిజినెస్‌లు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? స్పోర్ట్స్ థీమ్‌తో కపిల్ దేవ్ ‘ఎలెవన్స్’ రెస్టారెంట్ స్థాపించారు. విరాట్ కోహ్లీ (One8 Commune), రవీంద్ర జడేజా (జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్), సురేశ్ రైనా (రైనా), జహీర్ ఖాన్ (డైన్ ఫైన్), శిఖర్ దావన్ (ది ఫ్లైయింగ్ క్యాచ్), స్మృతి మందాన మహారాష్ట్రలోని సంగ్లీలో SM18 కేఫ్ నిర్వహిస్తున్నారు.

News March 12, 2025

ఉద్యోగులకు ₹33కోట్ల షేర్లు గిఫ్ట్‌గా ఇస్తున్న ప్రమోటర్

image

ఉద్యోగులకు తన షేర్లలో కొన్ని గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రమోటర్ సంజయ్ షా‌కు సెబీ అనుమతి ఇచ్చింది. కంపెనీ ఆరంభించి 25ఏళ్లు కావడంతో కొన్నేళ్లుగా నిజాయతీగా సేవలందిస్తున్న 650 మందికి ₹33కోట్ల విలువైన 1,75,000 షేర్లను పంచాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందుకు ఒక చిన్న నిబంధన అడ్డంకిగా మారడంతో సెబీని సంప్రదించారు. ప్రస్తుతం ఒక్కో షేరు ధర రూ.1900గా ఉంది. మీ కామెంట్.

error: Content is protected !!