News March 22, 2024
మీకు ఫ్రాడ్ కాల్, మెసేజ్ వచ్చాయా?

ఇటీవల ఫ్రాడ్ ఫోన్ కాల్స్, మెసేజ్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి వాటిపై కేంద్ర టెలికం శాఖ చక్షు పోర్టల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ఏ రూపంలో కాల్ వచ్చింది? కేటగిరీ, తేదీ, టైం, స్క్రీన్షాట్ సహా పలు అంశాలతో ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేందుకు ఇక్కడ <
Similar News
News October 25, 2025
హెన్నాతో జుట్టుకు ఎన్నో లాభాలు

జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి మన పూర్వీకుల నుంచి హెన్నా వాడుతున్నారు. ఇది చుండ్రును తగ్గించడంతో పాటు, జుట్టుకు సహజసిద్ధమైన రంగును అందించి కండిషనింగ్ చేస్తుంది. దీంట్లోని యాంటీఫంగల్, యాంటీమైక్రోబియల్ గుణాలు కుదుళ్లలోని ఇన్ఫెక్షన్లను తొలగించడంతో పాటు జుట్టుకు పోషణను అందించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాకుండా పొడిబారిన జుట్టుకు తేమను అందించి, చివర్లు చిట్లే సమస్యనూ తగ్గిస్తుంది.
News October 25, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ నేతలతో కీలక భేటీ
* మద్యం దుకాణాల టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్
* త్వరలోనే 14,000 అంగన్వాడీ హెల్పర్ల నియామకం
* కర్నూల్ బస్సు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్లో ప్రైవేటు బస్సుల్లో ముమ్మర తనిఖీలు
* హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కొనసాగుతున్న వర్షాలు
News October 25, 2025
మర్రి చెట్టును ఎందుకు పూజించాలి?

మర్రిచెట్టు జ్ఞానం, పవిత్రత, సౌభాగ్యానికి నిదర్శనం. దీన్నే వట వృక్షం అని అంటారు. మహా ప్రళయం తర్వాత విష్ణుమూర్తి శిశువుగా ఈ చెట్టు ఆకుపై శయనించడం వల్లే ఆయనకు ‘వటపత్రశాయి’ అనే నామం వచ్చింది. కైలాసంలో శివుడు ఈ వృక్షం నీడనే నివసిస్తాడని చెబుతారు. స్త్రీలు తమ వైవాహిక సౌభాగ్యం కోసం ఈ చెట్టును పూజించి, జ్యేష్ఠ పౌర్ణమిన ‘వటసావిత్రీ వ్రతం’ ఆచరిస్తారు. దీని కింద రుషులు ధ్యానం చేసి, విశ్రాంతి తీసుకుంటారు.


