News February 18, 2025

ఈకలు లేని కోడిని చూశారా?

image

AP: సాధారణంగా ఏ కోడికైనా ఈకలు ఉండటం సహజం. అయితే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెంలో ఈకలు లేని నాటు కోడి ఆశ్చర్యపరుస్తోంది. ఇది పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉందని, దీని వయసు 6 నెలలని యజమాని ఇస్మాయిల్ చెప్పారు. జన్యుపరమైన లోపం కారణంగా ఇలాంటి అరుదైన లక్షణాలు కోళ్లలో ఉంటాయని వైద్యాధికారులు తెలిపారు.

Similar News

News April 3, 2026

భద్రాద్రి క్షేత్రంలో నిత్యకళ్యాణాలు పునఃప్రారంభం

image

వరుస సెలవుల నేపథ్యంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. ఉచిత, శీఘ్ర దర్శన క్యూలైన్లు మధ్యాహ్నం వరకు కిక్కిరిసి కనిపించాయి. మరోవైపు, వసంతోత్సవాల కారణంగా నిలిచిపోయిన నిత్యకళ్యాణాలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు, పట్టణ వీధులు భక్తజన సంద్రంగా మారాయి.

News April 3, 2026

చరిత్ర సృష్టించిన ఆయుష్ మాత్రే

image

PBKSతో మ్యాచ్‌లో 43 బంతుల్లో 73 రన్స్ బాదిన ఆయుష్ మాత్రే(CSK) పలు రికార్డులను సొంతం చేసుకున్నారు. చెపాక్ స్టేడియంలో హాఫ్ సెంచరీ చేసిన పిన్న వయస్కుడి(18Y 261D)గా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో సురేశ్ రైనా(21Y 148D) రికార్డును బ్రేక్ చేశారు. అలాగే IPLలో 19 ఏళ్లలోపే రెండు అర్ధశతకాలు చేసిన మూడో ప్లేయర్‌గా నిలిచారు. ఈ జాబితాలో వైభవ్(3), పృథ్వీ షా(2) ముందున్నారు.

News April 3, 2026

మద్యం ధరలు పెరగనున్నాయా?

image

పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత్‌లో మద్యం ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గ్యాస్ సరఫరాలో అంతరాయం, ముడి పదార్థాల ధరల పెరుగుదల&కొరతతో గాజు బాటిళ్ల తయారీ వ్యయం 15-20% పెరిగింది. వీటికి తోడు షిప్పింగ్, అల్యూమినియం ధరలూ పెరగడంతో 10-15% ధరలు పెంచే యోచనలో కంపెనీలు ఉన్నాయి. బీర్లతో పాటు అన్ని రకాల మద్యం ధరలు పెంచాలని బ్రూవరీస్ ప్రతిపాదించాయి. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.