News August 22, 2025
కొత్త సినిమాలో చిరంజీవి మరో లుక్ చూశారా?

చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా నుంచి మరో లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇవాళ ఉదయం విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇదే ఉత్సాహంలో సెకండ్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఇందులో కుర్చీలో స్టైల్‌గా కూర్చున్న చిరు సిగరెట్ తాగుతూ కనిపించారు. ఈ కొత్త పోస్టర్ సైతం అభిమానులను ఆకట్టుకుంటోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
Similar News
News August 22, 2025
BREAKING: DSC మెరిట్ జాబితా విడుదల

AP: మెగా DSC మెరిట్ జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ వివరాలను అధికారిక <
News August 22, 2025
భారత్‌కు మద్దతు.. అమెరికా మాజీ NSA ఇంట్లో తనిఖీలు

INDపై ట్రంప్ టారిఫ్‌లను తప్పుబట్టిన US మాజీ జాతీయ భద్రతా సలహాదారు(NSA) జాన్ బోల్టన్ ఇంట్లో FBI తనిఖీలు చేపట్టింది. INDకు మద్దతు తెలిపిన మరునాడే ఇలా జరగడం గమనార్హం. తమ అధికారులు విధులు నిర్వర్తించారని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని FBI డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. తనిఖీలు జరుగుతున్నా జాన్ వెనక్కి తగ్గలేదు. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఉక్రెయిన్-రష్యాతో భేటీలు అవుతూనే ఉంటారని విమర్శించారు.
News August 22, 2025
త్వరలో అసెంబ్లీ సమావేశాలు!

TG: త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న జరిగే క్యాబినెట్ భేటీలో తేదీలు ఖరారు చేస్తారని విశ్వసనీయ సమాచారం. సమావేశాల సందర్భంగా కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక గురించి ముఖ్యంగా చర్చ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.