News December 4, 2024
బాలయ్య కొత్త గెటప్ చూశారా?

పాత్ర ఏదైనా తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య. అన్‌స్టాపబుల్ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బాలయ్య వ్యోమగామి లుక్‌లో కనిపించారు. దీంతో ఆదిత్య 369 సీక్వెల్‌కి బాలయ్య హింట్ ఇచ్చారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు గతంలో బాలయ్యకు ఈ మూవీ సీక్వెల్‌ను తన కుమారుడు మోక్షజ్ఞతో తీస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజా గెటప్ చర్చనీయాంశంగా మారింది.
Similar News
News April 3, 2026
అమరావతిపై 2-3 రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు బిల్లును ఆమోదించాయి. పార్లమెంటు సెక్రటేరియట్ నుంచి హోం శాఖకు ఈ బిల్లు ప్రతులు చేరాయి. బిల్లును హోంశాఖ 2, 3 రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించనుంది. రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే చట్టంగా మారుతుంది. ఆపై కేంద్రం దానిపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అనంతరం అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధ రాజధాని కానుంది.
News April 3, 2026
శరీరంలో వేడిని ఎలా తగ్గించాలంటే?

కొందరి శరీరంలో ఎప్పుడూ వేడి ఎక్కువగా ఉంటుంది. ఇది తగ్గాలంటే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కొబ్బరినీళ్లు, కలబంద, పుదీనా జ్యూస్ వంటివి వేడి తగ్గడంలో సహకరిస్తాయి. మజ్జిగ, విటమిన్ సీ ఉండే ఆహారాలు తీసుకోవాలి. అలాగే కీరదోస, బీట్రూట్ జ్యూస్ తాగినా ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు తగినంత నీటిని తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
News April 3, 2026
₹931 కోట్ల అమెరికా ఫైటర్ జెట్‌ను కూల్చేసిన ఇరాన్!

అమెరికాకు చెందిన మరో F-35 ఫైటర్ జెట్‌ను కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. సెంట్రల్ ఇరాన్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా దాడి చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి పలు ఫొటోలను షేర్ చేసింది. దీనిపై ఇంకా US స్పందించలేదు. మార్చి 19న కూడా F-35 జెట్‌ను కూల్చేసినట్టు ఇరాన్ చెప్పింది. ఈ విమానం విలువ ₹931 కోట్ల పైనే అని సమాచారం. కువైట్‌లో చమురు శుద్ధి కర్మాగారం, సౌదీలోని US రాడార్‌ను ఇరాన్ ధ్వంసం చేసింది.


