News August 17, 2025

‘గీతాంజలి’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?

image

నాగార్జున కెరీర్‌లో ‘గీతాంజలి’ (1989) ఓ క్లాసిక్. మణిరత్నం తెరకెక్కించిన ఆ చిత్రంలో గిరిజ హీరోయిన్. తాజాగా జగపతి బాబు హోస్ట్ చేసిన ఓ షోలో ఆ సినిమా విశేషాలను ఆమె పంచుకున్నారు. ‘నాకు అది తొలి సినిమా. నాగార్జునకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. సౌమ్యుడు. అతడు లెజెండ్‌కు తక్కువేం కాదు. నా ఫస్ట్ మూవీలో సహ నటుడిగా ఉన్నందుకు థాంక్యూ’ అని చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఆమె స్క్రీన్‌పై కనిపించడంతో ఫొటో వైరలవుతోంది.

Similar News

News August 17, 2025

ముగ్గురు MLAలపై సీఎం తీవ్ర ఆగ్రహం

image

AP: అనంతపురం <<17432318>>ఎమ్మెల్యేపై<<>> ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలతో పార్టీకి నష్టం చేసే చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేలపై వచ్చిన వార్తలపై CM అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని సార్లు తప్పు లేకపోయినా, తప్పుడు ప్రచారం జరుగుతున్నా నేతలు వెంటనే బయటకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

News August 17, 2025

రాధాకృష్ణన్‌కు ఎంతో అనుభవం ఉంది: మోదీ

image

NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన <<17436566>>C.P. రాధాకృష్ణన్‌కు<<>> ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘ఎంపీగా, గవర్నర్‌గా రాధాకృష్ణన్‌కు ఎంతో అనుభవం ఉంది. ప్రజాజీవితంలో అంకితభావంతో పని చేశారు. ఆయనకు రాజ్యాంగంపై మంచి పట్టు ఉంది. NDA కూటమి ఆయన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు సైతం రాధాకృష్ణన్‌కు అభినందనలు తెలిపారు.

News August 17, 2025

అఫిడవిట్ అడిగిన CEC.. స్పందించిన రాహుల్

image

CEC <<17435119>>వ్యాఖ్యలపై<<>> రాహుల్ గాంధీ స్పందించారు. ‘ఈసీ నన్ను అఫిడవిట్ అడిగింది. నా లాంటి ఆరోపణలే చేసిన అనురాగ్ ఠాకూర్ (బీజేపీ నేత)ను ఎందుకు అడగలేదు. MH అసెంబ్లీ ఎన్నికలను NDA క్లీన్‌స్వీప్ చేసింది. ఆ ఫలితాలపై రీసెర్చ్ చేశాం. 4 నెలల్లో ఈసీ కోటి ఓట్లు చేర్చినట్లు గుర్తించాం. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చిన ఓట్లలో తేడా లేదు. కొత్తగా వచ్చిన కోటి ఓట్ల వల్లే ఎన్డీయే గెలిచింది’ అని వ్యాఖ్యానించారు.