News August 16, 2024
కొత్త మూవీలో బ్రహ్మీ ఫస్ట్ లుక్ చూశారా?

స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, తన కుమారుడు గౌతమ్తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘బ్రహ్మా ఆనందం’గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సంప్రదాయ వస్త్రధారణలో బ్రహ్మీ లుక్ ఆకట్టుకుంటోంది. కాగా ఈ నెల 19న మధ్యాహ్నం 12:34 గంటలకు గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
Similar News
News November 26, 2025
జగిత్యాలలో మొత్తం ఓటర్లు 6,07,263 లక్షల మంది

జగిత్యాల జిల్లాలో మొత్తం 6,07,263 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఇందులో 2,89,702 మంది పురుషులు, 3,17,552 మంది మహిళలు, 9 మంది ఇతరులు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండటం విశేషమన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటరు సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు.
News November 26, 2025
రేపటి నుంచి RRB గ్రూప్ డీ పరీక్షలు

RRB గ్రూప్-D పరీక్షలను రేపటి నుంచి జనవరి 16 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు 4 రోజుల ముందు మెయిల్కు సమాచారం పంపిస్తారు. ఆతర్వాత అడ్మిట్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా 32,438 పోస్టులను భర్తీ చేయనుంది. వెబ్సైట్: https://www.rrbcdg.gov.in/
News November 26, 2025
తెంబా బవుమా.. ఓటమి ఎరుగని నాయకుడు

SA క్రికెట్లో అద్భుతమైన నాయకుడిగా తనదైన ముద్ర వేస్తున్న కెప్టెన్ తెంబా బవుమా ఇప్పుడు కొత్త సంచలనాలను నమోదు చేస్తున్నారు. 27ఏళ్ల తర్వాత తన జట్టుకు తొలి ICC టైటిల్ అందించిన తొలి దక్షిణాఫ్రికా కెప్టెన్గా ఆయన నిలిచిన విషయం తెలిసిందే. తాజా సిరీస్ విజయంతో 25ఏళ్ల తరువాత భారత్లో టెస్ట్ సిరీస్ గెలిపించిన కెప్టెన్ అయ్యారు. 12 మ్యాచ్ల్లో 11 విజయాలు, 1 డ్రాతో విజయవంతమైన కెప్టెన్లలో ఒకరుగా ఉన్నారు.


