News August 22, 2025

‘Mega158’ కాన్సెప్ట్ పోస్టర్ చూశారా?

image

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేళ డైరెక్టర్ బాబీతో తీస్తోన్న ‘Mega158’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఆయనతో రెండో సారి కలిసి పనిచేయడం గర్వంగా ఉందంటూ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ను బాబీ షేర్ చేశారు. గొడ్డలి వేటుతో రక్తపు ధార కిందకు వచ్చినట్లుగా పోస్టర్‌లో చూపించారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. చిరు బర్త్ డే సందర్భంగా 3 సినిమాల అప్డేట్స్ రావడం విశేషం.

Similar News

News March 14, 2026

రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

image

భారత్‌లో ఈ ఫిబ్రవరిలో 4,17,705 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) వెల్లడించింది. 2025 FEBతో పోలిస్తే ఇది 10% అధికం. 2, 3 వీలర్ల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ గరిష్ఠాలను నమోదు చేశాయి. 2 వీలర్ సేల్స్(18,71,406) 35.2%, 3 వీలర్ సేల్స్(74,573) 29% పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల్లో మారుతి సుజుకి, 2 వీలర్లలో హీరో మోటోకార్ప్ టాప్‌లో నిలిచాయి.

News March 14, 2026

US అప్పుడు ఇండియాను బెదిరించి ఇప్పుడు వేడుకుంటోంది: ఇరాన్

image

రష్యా నుంచి చమురు కొనవద్దని ఇండియాను అమెరికా కొన్ని నెలలపాటు బెదిరించిందని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అరఘ్చి ట్వీట్ చేశారు. ఇరాన్‌తో 2 వారాల యుద్ధం తర్వాత ఆ పరిస్థితి మారిందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని INDతో సహా మిగతా దేశాలను US వేడుకుంటోందని విమర్శించారు. ఇరాన్‌పై వార్‌కు మద్దతిస్తే రష్యాకు వ్యతిరేకంగా US సపోర్ట్ తమకు లభిస్తుందనుకున్న యూరప్‌కు ఎదురుదెబ్బ తగిలిందన్నారు.

News March 14, 2026

డైరెక్టర్‌గా శేఖర్ మాస్టర్.. హీరోగా ప్రభుదేవా కుమారుడు?

image

డాన్స్ కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లుగా మారడం కొత్తేం కాదు. ఇప్పుడు ఈ లిస్టులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేరబోతున్నట్లు సమాచారం. ఆయన తెరకెక్కించే సినిమాతో ప్రభుదేవా కుమారుడు రిషిల్ రాఘవేంద్ర దేవా హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మే నుంచి షూటింగ్ ఉంటుందని, త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలిపాయి. మ్యూజిక్, డాన్స్‌కి ప్రాధాన్యమున్న స్టోరీతో ఈ మూవీ రానుందట.