News March 18, 2025
సూపర్ స్టైలిష్‌గా మెగాస్టార్.. లుక్ చూశారా?

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా నుంచి తాజాగా రిలీజైన స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి యంగ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. లుక్ సూపర్‌గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని, ఒక సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.
Similar News
News March 19, 2025
ALERT: రేపు 59 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలోని 59 మండలాల్లో రేపు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం-15, విజయనగరం-20, మన్యం-14, అల్లూరి-2, కాకినాడ-3, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. మరోవైపు రాష్ట్రంలోనే అత్యధికంగా ఇవాళ నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా అట్లూరులో 41.2, ప్రకాశం జిల్లా గోళ్లవిడిపిలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 19, 2025
టిక్‌టాక్ రీల్ అనుకరిస్తూ కోమాలోకి బాలిక

టిక్‌టాక్ రీల్ అనుకరిస్తూ ఓ బాలిక కోమాలోకి వెళ్లింది. USలోని మిస్సోరి ఫెస్టస్‌కు చెందిన స్కార్లెట్ సెల్బీ(7) టిక్‌టాక్‌లో నీడో క్యూబ్ ఆకృతిని మార్చే రీల్ చూసింది. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని రీల్లో చూపించినట్లు ఆ క్యూబ్‌ను తొలుత ఫ్రీజ్ చేసి ఆపై ఒవెన్‌లో ఉంచింది. దానిని బయటికి తీసినప్పుడు క్యూబ్ పేలి, అందులోని వేడి ద్రవం ఆమె ముఖం, ఛాతిపై పడింది. కొంత నోరు, ముక్కులోకి చేరడంతో కోమాలోకి వెళ్లింది.
News March 19, 2025
ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా సుచిత్రా ఎల్లా, సతీశ్ రెడ్డి

AP: భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా, DRDO మాజీ చీఫ్ సతీశ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులయ్యారు. చేనేత, హస్తకళల అభివృద్ధికి సంబంధించి సుచిత్ర, ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అడ్వైజర్‌గా సతీశ్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. క్యాబినెట్ ర్యాంకుతో రెండేళ్లపాటు వీరు పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు.