News December 14, 2024

విద్యార్థుల కామన్ డైట్ మెనూ చూశారా?

image

TG: గురుకుల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం <>కామన్ డైట్ మెనూను<<>> తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో నెలకు ఆరు రోజులు నాన్ వెజ్( 2 రోజులు మటన్, 4 రోజులు చికెన్) అందించనుంది. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మాత్రమే కాకుండా ఉదయం బ్రేక్ టైమ్‌లో పండ్లు, సాయంత్రం స్నాక్స్ ఇవ్వనుంది. నాన్ వెజ్ తినని వారికి మీల్ మేకర్ కర్రీ అందిస్తుంది. అలాగే గుడ్డును వారానికి 2/3 రోజులు ఉడికించి, 2/3 రోజులు కర్రీ రూపంలో అందించనుంది.

Similar News

News November 11, 2025

మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఎంతంటే?

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94% పోలింగ్ మాత్రమే నమోదైంది. చాలామంది ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో కొన్ని పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఏ అభ్యర్థీ నచ్చకపోతే నోటాకు కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు.

News November 11, 2025

ఢిల్లీ పేలుడు.. కీలక సూత్రధారి ఈమే..!

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో అరెస్టైన యూపీ మహిళ Dr.షాహీన్ ఫొటో బయటికొచ్చింది. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద ఆపరేషన్‌కు నిధులు సమకూర్చడం, ఆపరేషన్‌ను సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

News November 11, 2025

కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డికి CBI నోటీసులు

image

AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డికి CBI నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఈనెల 13, లేదా 15న విచారణకు వస్తానని సుబ్బారెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కల్తీకి సంబంధించి సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నిస్తున్నారు.