News August 18, 2025
ఈ రకమైన వాకింగ్ ట్రై చేశారా?

వాకింగ్ రకాల్లో బ్రిస్క్ వాకింగ్ ఒకటి. ఇందులో సాధారణం కంటే ఎక్కువ వేగంతో నడుస్తూ చేతులను లయబద్ధంగా ఆడించాల్సి ఉంటుంది. నిమిషానికి 100 స్టెప్పులు లేదా గంటకు 7.24 కి.మీ నడవాల్సి ఉంటుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందని డాక్టర్లు తెలిపారు. ఎక్కువ మొత్తంలో కెలోరీలు బర్న్ అయి బరువు తగ్గుతారని, డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని పేర్కొన్నారు. ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయన్నారు.
Similar News
News August 18, 2025
బహుజన బందూక్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నేడు. జనగామ జిల్లాలో సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ తన పోరాట పటిమతో నిజాం రాజులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. పేద ప్రజల పక్షాన నిలబడి, అప్పటి దోపిడీ వ్యవస్థను ఎదిరించారు. ఆయన పోరాటానికి నిదర్శనంగా HYDలోని ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేసేందుకు CM రేవంత్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.
News August 18, 2025
స్పెషల్ సూట్‌కేస్‌లో పుతిన్ మలం.. ఎందుకో తెలుసా?

రష్యా వంటి శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడైన పుతిన్ సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు ఇది మంచి ఉదాహరణ. ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు అతని మలాన్ని సేకరించి సొంత దేశానికి తీసుకొస్తారని ఫ్రాన్స్ జర్నలిస్టులు వెల్లడించారు. స్పెషల్ బ్యాగుల్లో మలాన్ని సేకరించి, వాటిని బ్రీఫ్‌కేసుల్లో తీసుకొస్తారని పేర్కొన్నారు. విదేశీ శక్తులు పుతిన్ వ్యర్థాల శాంపిళ్లతో ఆరోగ్య రహస్యాలు తెలుసుకోకుండా ఇలా చేస్తారట.
News August 18, 2025
రికార్డు స్థాయిలో 23.6సెం.మీల వర్షపాతం

TG: రాష్ట్రంలో గడిచిన 12 గంటల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట(D) గౌరారంలో అత్యధికంగా 23.6cmల వర్షపాతం నమోదైంది. ములుగు(సిద్దిపేట)లో 18.6cm, మెదక్‌లోని ఇస్లాంపూర్‌లో 17.85cm, పిట్లం(కామారెడ్డి)లో 17.3cm, కౌడిపల్లి(మెదక్)లో 17.2cm, సంగారెడ్డిలో కంగ్టిలో 16.6cm, శంకరంపేట(మెదక్)లో 16.4cm, అడ్డగూడురు(యాదాద్రి)లో 16.4cmల వర్షపాతం కురిసినట్లు వెల్లడించింది.