News September 29, 2024
మీ పిల్లల్ని Sportsలో జాయిన్ చేశారా!

విద్యార్థుల చదువులను మెరుగుపరచడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. క్రీడల వల్ల వారిలో ఆలోచన, అభ్యాస సామర్థ్యాలు, టీమ్‌వర్క్-కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు వంటి సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయన్నది నిపుణుల అభిప్రాయం. అలాగే సమయపాలన-క్రమశిక్షణతో కూడిన నడవడిక, ఏకాగ్రతను పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయని, తద్వారా వారి చదువులు మెరుగుపడతాయని పేర్కొంటున్నారు.
Similar News
News December 1, 2025
ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలి: ఎస్పీ నరసింహ

గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ నరసింహ అధికారులను ఆదేశించారు. పెన్ పహాడ్ మండల కేంద్రంలో నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే, ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
News December 1, 2025
మీది పొడిచర్మమా? అయితే ఇలా చేయండి

బాడీలో సెబాషియన్ గ్రంధుల ద్వారా కొన్ని జిడ్డు పదార్థాలు తక్కువగా ప్రొడ్యూస్ అయినపుడు చర్మం పొడిగా, నిర్జీవంగా ఉంటుంది. దాన్నే డ్రై స్కిన్ టైప్ అంటున్నారు నిపుణులు. ఈ టైప్ స్కిన్‌కి ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. ఇన్ఫెక్షన్లు సోకితే ముక్కు, కనుబొమ్మల చుట్టూ దద్దుర్లు వస్తాయి. ఈ స్కిన్ టైప్ వారు సున్నితమైన క్లెన్సర్&హ్యూమెక్టెంట్స్ ఉండే మాయిశ్చరైజర్‌ని ఎంచుకుంటే చర్మం తేమగా, తాజాగా ఉంటుందంటున్నారు.
News December 1, 2025
దూడల్లో నట్టల బెడద – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దూడలకు నట్టల బెడద సర్వసాధారణం. ఈ సమస్య గేదె దూడలలో ఎక్కువగా వస్తుంది. దూడల్లో నట్టల సమస్య ఉంటే వాటికి తరచూ విరేచనాలు అయ్యి దూడ పెరుగుదల సక్రమంగా ఉండదు. వెంట్రుకలు బిరుసుగా ఉండి, నడుము కిందికి జారి ఉంటుంది. దవడల మధ్య నీరు చేరుతుంది. ఈ సమస్య కట్టడికి దూడ పుట్టిన ఎనిమిది రోజులలో తొలిసారి, తర్వాత ప్రతి నెలకు ఒకసారి చొప్పున ఆరు నెలల వయసు వచ్చేవరకు వెటర్నరీ నిపుణుల సూచనలతో నట్టల మందు తాగించాలి.


