News January 30, 2025

తల్లిదండ్రులూ ఇది గమనించారా?

image

మీ ఇంట్లో ముగ్గురు పిల్లలున్నారా? అయితే మీరు ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించే ఉంటారు. ముగ్గురిలో మధ్యలో ఉన్న పిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారని పరిశోధనలో తేలింది. వీరు తోబుట్టువులతో ఎంతో నిజాయతీగా, వినయంతో ఉంటారని, అంగీకారయోగ్యమైన వారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వారు గొడవలు జరగకుండా చూస్తూ కుటుంబ వ్యవహారాలను సమతుల్యం చేస్తారని తెలిపాయి. దీనిపై మీ కామెంట్?

Similar News

News November 25, 2025

నల్గొండ: రైతు భరోసా కోసం రైతుల ఎదురుచూపులు

image

నల్గొండ జిల్లాలో యాసంగి పంట సాగుకు సిద్ధమవుతున్న 10.82 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకం పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం, యాసంగి పంటలకు కలిపి ప్రభుత్వం ఏటా రూ.12,000 అందిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో విడుదల కావాల్సిన ఈ యాసంగి సహాయం ఇప్పటివరకు రాకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

News November 25, 2025

ఆకుకూరల సాగు- అనువైన నేలలు, వాతావరణం

image

తక్కువ సమయంలో రైతు చేతికొచ్చి, నిరంతరం ఆదాయం అందించే పంటల్లో ఆకుకూరలు ముందుంటాయి. ఆకుకూరలను మురుగు నీరు ఇంకిపోయే అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. నేల ఉదజని సూచిక 6.0 నుంచి 7.5గా ఉండాలి. వానాకాలం, వేసవి కాలం, 16 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న సమయం ఆకుకూరల పంటలు పెరగడానికి అత్యంత అనుకూలం. 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే తోటకూరను సాగు చేయడం కష్టం.

News November 25, 2025

మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు: సజ్జల

image

AP: వైసీపీని టార్గెట్ చేస్తూ తిరుమల లడ్డూ విచారణ జరుగుతోందని వైసీపీ నేత సజ్జల అన్నారు. ‘కల్తీ నెయ్యి విచారణ పారదర్శకంగా జరగడం లేదు. మేము లడ్డూ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అప్పుడు ఇవే కంపెనీలు, ఇప్పుడూ ఇవే కంపెనీలు నెయ్యి సప్లై చేస్తున్నాయి.. నెయ్యి కల్తీకి ఎక్కడ అవకాశం ఉంది’ అని ప్రెస్ మీట్‌లో ప్రశ్నించారు.