News October 18, 2024
రిజర్వేషన్లపై మీ అభిప్రాయం చెప్పండి: బీసీ కమిషన్

TG: స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లను ఖరారు చేయడంపై BC కమిషన్ ప్రజల నుంచి అభ్యర్థనలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరిస్తోంది. ఈ నెల 28న ADB, 29న NZB, 30న SRD, నవంబర్ 1న KRMR, 2న WGL, 4న NLG, 5న ఖమ్మం, 7న RR, 8న MBNR, 11న HYDలో జిల్లా కలెక్టరేట్/ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల్లో విచారణలు చేయనుంది. నవంబర్ 11న ప్రత్యేకంగా NGOలు, సంస్థలు మరియు కుల/సంక్షేమ సంఘాలతో భేటీ కానుంది.
Similar News
News January 23, 2026
ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.
News January 23, 2026
వసంత పంచమి రోజు పఠించాల్సిన మంత్రాలివే..

చదువుల తల్లి ఆశీస్సుల కోసం ఈరోజు ‘సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం’ పఠించడం అత్యంత ఫలప్రదం. విద్యార్థులు ‘సరస్వతి నమస్తుభ్యం’ శ్లోకాన్ని 108 సార్లు జపించాలి. మేధాశక్తి పెరగడానికి ‘ఓం హ్రీం ఐం సరస్వత్యై నమః’ అనే బీజాక్షర మంత్రాన్ని ధ్యానించాలి. గ్రహ దోషాలు, బుధ గ్రహ దోషం ఉన్నవారు సరస్వతీ కవచం పఠించడం వల్ల వాక్చాతుర్యం లభిస్తుంది. భక్తితో ఈ మంత్రాలను స్మరిస్తే ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో విజయం లభిస్తుంది.
News January 23, 2026
వసంత పంచమి వేడుకలు ఎలా చేసుకోవాలంటే..

వసంత పంచమి వేడుకల్లో పసుపు రంగుకు ప్రాధాన్యం ఎక్కువ. ప్రజలు తెల్లవారునే లేచి, పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతీ పూజ చేస్తారు. పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టి పంచుకుంటారు. కొందరు శివపార్వతులను పూజిస్తారు. మరికొందరు సూర్య నమస్కారాలు చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విందులు ఆరగిస్తూ, పాటలతో, నృత్యాలతో ఈ వసంత ఆగమనాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.


