News June 29, 2024
మహిళతో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరమే!

మహిళల హక్కులు, వారి గౌరవాన్ని పరిరక్షించడానికి కొత్త క్రిమినల్ చట్టాలలో కఠినమైన నిబంధనలు చేర్చినట్లు PIB పేర్కొంది. ఇకపై తప్పుడు వాగ్దానాలతో మహిళను లోబరుచుకొని ఆమెతో లైంగిక సంబంధాలను పెట్టుకోవడం నేరం. దోషులకు కఠిన శిక్షలు తప్పవని వెల్లడించింది. జులై 1 నుంచే కొత్త చట్టాలు అమలులోకి రానున్నాయి. ఇకపై పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయొచ్చు.
Similar News
News October 29, 2025
వరంగల్: దారి తప్పిన గురూజీ.. గుణ‘పాఠం’ చెప్పేనా?

ఉమ్మడి వరంగల్లో విద్యార్థినులపై టీచర్ల లైంగిక వేధింపుల వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారం క్రితం MHBD ప్రభుత్వ బడిలో జరిగిన ఘటన మరువక ముందే మంగళవారం మరో బడిలో ఈ ఘటన వెలుగు చూసింది. భూపాలపల్లిలోనూ ఓ బడిలో PET వేధించడంతో పేరెంట్స్ చితకబాదారు. దీంతో విద్యార్థినులు బడికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. అయినా, అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోట్లేదని, తగిన గుణపాఠం చెప్పాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
News October 29, 2025
పంట దిగుబడిని పెంచే పచ్చి ఆకు ఎరువు అంటే ఏమిటి?

కొన్ని రకాల చెట్ల నుంచి పచ్చి లేత కొమ్మలను సేకరించి పొలంలో వేసి కలియదున్నడాన్నే పచ్చి ఆకు ఎరువు అంటారు. పొలంలో దుక్కి చేసే రోజే లేత కొమ్మలు, ఆకులను చేనంతా వేసి భూమిలో కలియదున్నాలి. ఇది క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి మట్టిని సారవంతం చేస్తుంది. ఈ భూమిలో వేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. కానుగ, సీతాఫలం, అవిశ, తంగేడు, వేప వంటి మొక్కలను పచ్చి ఆకు ఎరువు కోసం ఎంపిక చేసుకోవచ్చు.
News October 29, 2025
EPFO వేతన పరిమితి త్వరలో రూ.25వేలకు పెంపు?

EPFO వేతన పరిమితిని నెలకు ₹15,000 నుంచి ₹25,000కు పెంచే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం బేసిక్ పే గరిష్ఠంగా ₹15వేల వరకు ఉన్న ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు మాత్రమే దీని పరిధిలోకి వస్తున్నారు. వారికి EPF, ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) అమలవుతున్నాయి. ఇప్పుడు ఈ పరిమితిని ₹25వేలకు పెంచే విషయంపై త్వరలో జరిగే EPFO సెంట్రల్ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.


