News March 11, 2025
నిషేధిత జాబితాలోకి ‘హయగ్రీవ’ భూములు

AP: విశాఖపట్నం ఎండాడలోని ‘హయగ్రీవ’ భూములను రాష్ట్ర సర్కార్ నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరగకుండా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ చర్యలు తీసుకున్నారు. కాగా వైసీపీ హయాంలో హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు 12.51 ఎకరాలు కేటాయించింది. నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడిందంటూ కూటమి సర్కార్ ఆ భూములను వెనక్కి తీసుకుంది. ఇప్పుడు వీటిని నిషేధిత జాబితాలో చేర్చింది.
Similar News
News March 12, 2025
త్వరలో భారత్‌కు జేడీ వాన్స్!

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈనెలాఖరులో భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా రానున్నారు. అమెరికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన ఉషను జేడీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ జంట భారత్‌లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. పదవి చేపట్టిన తర్వాత జేడీ వాన్స్‌కు ఇది రెండో అధికారిక పర్యటన. ఇటీవల ఆయన ఫ్రాన్స్, జర్మనీలో పర్యటించారు.
News March 12, 2025
ఇందిరా మైదానంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

AP: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో MLAలు, ఎమ్మెల్సీలకు ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో 3 గంటలకు ప్రారంభ కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందులో సభ్యులంతా పాల్గొనాలని సూచించారు. పురుషులకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ.. మహిళలకు బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించనున్నారు.
News March 12, 2025
లొంగిపోయిన బోరుగడ్డ అనిల్

AP: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వెళ్లి లొంగిపోయారు. నిన్నటితోనే ఆయన మధ్యంతర బెయిల్ ముగిసినా జైలుకు వెళ్లలేదు. మరోసారి బెయిల్ పొడిగించాలని ఆయన న్యాయవాది కోరగా హైకోర్టు నిరాకరించింది. దీంతో ఇవాళ జైలుకు వెళ్లి లొంగిపోయారు. తల్లి ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లతో బోరుగడ్డ అనిల్ బెయిల్ పొందినట్లు ఆరోపణలున్నాయి.