News March 10, 2025

విశాఖలో ‘హయగ్రీవ’ భూములు వెనక్కి

image

AP: విశాఖలో హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్‌కు ఇచ్చిన 12.41 ఎకరాల భూ కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతూ సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. అటు అమరావతిలోనూ 13 సంస్థల భూ కేటాయింపులను రద్దు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ <<15713685>>నిర్ణయించిన<<>> విషయం తెలిసిందే.

Similar News

News November 23, 2025

నోబెల్ వచ్చినా దేశం దాటలేని పరిస్థితి

image

ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి విన్నర్ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డిసెంబర్‌ 10న నార్వేలో జరిగే నోబెల్ పురస్కారాల వేడుకకు హాజరైతే, ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఆ దేశ అటార్నీ జనరల్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినందుకు ఆమెకు నోబెల్ బహుమతి ప్రకటించినప్పటికీ, దేశం బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

News November 23, 2025

హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

image

HYDలోని CSIR-NGRI 3 ప్రాజెక్ట్ అసోసియేట్, అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 27వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc, MSc, M.Tech (జియో ఫిజిక్స్, అప్లైడ్ జియోఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, మెరైన్ జియోఫిజిక్స్), MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. NOV 28, DEC 3 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. https://www.ngri.res.in/

News November 23, 2025

KG చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర రూ.220గా ఉంది. చిత్తూరులో రూ.219-232 వరకు పలుకుతోంది. మటన్ కేజీ రూ.800-900 మధ్య ఉంది. అటు కోడిగుడ్డు రూ.7వరకు అమ్ముతున్నారు. కార్తీక మాసం ముగియడంతో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.