News October 19, 2024
గ్రూప్-1 మెయిన్స్ రద్దు పిటిషన్‌పై ఘాటుగా స్పందించిన HC

TG: గ్రూప్-1 మెయిన్స్ రద్దు కుదరదని తీర్పిచ్చిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నోటిఫికేషన్ జారీనే చట్టవిరుద్ధమన్నప్పుడు ప్రిలిమ్స్ రాయకముందు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదు. ఇప్పటికే రెండుసార్లు రద్దయ్యాయి. మొదటిసారి 5 లక్షల మంది రాస్తే ఇప్పుడు ఆ సంఖ్య 3 లక్షలకు వచ్చింది. మళ్లీ రద్దంటే కుదరదు. ఇంకా ఎన్నేళ్లు ఇలా? వీటిని అనుమతిస్తే కొత్త అభ్యంతరాలతో మరికొందరు వస్తారు’ అని ఘాటుగా స్పందించింది.
Similar News
News October 16, 2025
ట్రంప్ ‘ఆయిల్’ కామెంట్స్‌పై భారత్ స్పందన

రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయబోమంటూ మోదీ హామీ ఇచ్చారన్న ట్రంప్ <<18018198>>వ్యాఖ్యలపై<<>> భారత్ స్పందించింది. తాము ఆయిల్, గ్యాస్ ప్రధాన దిగుమతిదారని, దేశంలోని వినియోగదారుల ప్రయోజనాలను బట్టే కొనుగోలు చేస్తామని MEA అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీని ఆధారంగానే తమ ఇంధన దిగుమతి విధానాలు రూపొందించామన్నారు. అటు ఇంధన సేకరణ పెంచుకోవడానికి అమెరికాతోనూ చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు.
News October 16, 2025
బిహార్‌లో.. రాజు లేని యుద్ధం.. గెలుస్తారా..?

మనం చూడని చరిత్రలో, చూసిన బాహుబలిలో, ఆడే చెస్‌లో రాజు లేడంటే ఆ యుద్ధం ముగిసి, ప్రత్యర్థి గెలిచినట్లే. కానీ ప్రశాంత్ కిషోర్ ఈ సహజ విధానానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఎన్నో పార్టీలకు వ్యూహకర్తగా వెనకుండి నడిపించిన ఆయన బిహార్‌లో జనసురాజ్ పార్టీ పెట్టారు. ఇక్కడా తను పోటీ చేయకుండా JSP అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించారు. దీంతో ప్రత్యర్థుల విమర్శలకు ఎలా బదులివ్వాలో సొంత నేతలకే తెలియట్లేదు.
News October 16, 2025
ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం బయల్దేరిన మోదీ, CBN, పవన్

AP: రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. ముగ్గురూ కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్నారు. ఆలయం వద్ద 1,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.