News February 3, 2026
HCA కొత్త ప్రెసిడెంట్‌గా అమర్‌నాథ్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కొత్త ప్రెసిడెంట్‌గా అమర్‌నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ అంబుడ్స్‌మన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. గత 9నెలలుగా పదవి ఖాళీగా ఉండగా తనను HCA అధ్యక్షుడిగా నియమించాలంటూ ఇటీవల అమర్‌నాథ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు జారీ చేశారు. గెలాక్సీ క్రికెట్ క్లబ్ ప్రతినిధి, మాజీ సెంట్రల్ ఎక్సైజ్ అధికారి అయిన అమర్‌నాథ్ గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచారు.
Similar News
News February 16, 2026
₹1.28లక్షల కోట్ల బంగారం మాయం కాలేదు: FACT CHECK

ఆర్బీఐ ఖజానాలో ఉన్న 880.18టన్నుల బంగారం నుంచి రూ.1.28లక్షల కోట్ల విలువైన గోల్డ్ మాయమైందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్‌చెక్ స్పష్టం చేసింది. బంగారం నిల్వల విలువ తగ్గినట్లు మాత్రమే RBI ప్రకటించిందని తెలిపింది. ఈ తగ్గుదల మార్కెట్ విలువలో మార్పుల వల్లేనని.. నిల్వల్లోని బంగారం ఎక్కడికీ పోలేదని వివరించింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది.
News February 16, 2026
మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ

తనకు షోల్డర్ కీహోల్ సర్జరీ జరిగినట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఇది చిన్న సర్జరీ అని, వేగంగా కోలుకుంటున్నానని ట్వీట్ చేశారు. రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. అల్లు శిరీష్ పెళ్లి ఆహ్వాన పత్రిక అందుకుంటున్న సమయంలో తీసిన ఫొటోల్లో చిరంజీవి చేతికి కట్టుతో కనిపించారు. దీంతో ఆయన చేతికి ఏం జరిగిందోనని సినీ వర్గాలు, అభిమానులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఆయన దీనిపై స్పష్టతనిచ్చారు.
News February 16, 2026
BRS సొంతం చేసుకున్న మున్సిపాలిటీలు (EC సైట్ ప్రకారం)

రాయికల్ (జగిత్యాల జిల్లా), ఆలంపూర్ (గద్వాల), అయిజ (గద్వాల), అమనగల్ (రంగారెడ్డి), అమరచింత (వనపర్తి), ఆసిఫాబాద్ (కొమురం భీం), తూప్రాన్ (మెదక్), మూడుచింతలపల్లి (మల్కాజ్‌గిరి), ఎల్లంపేట్ (మల్కాజ్‌గిరి), సిరిసిల్ల, గడ్డపోతారం (సంగారెడ్డి), గుమ్మడిదల (సంగారెడ్డి), ఇస్నాపూర్ (సంగారెడ్డి), జిన్నారం (సంగారెడ్డి), చేర్యాల (సిద్దిపేట), దుబ్బాక (సిద్దిపేట), గజ్వేల్ (సిద్దిపేట), తిరుమలగిరి (సూర్యాపేట).


