News July 11, 2025

HCA అధ్యక్షుడే కీలక సూత్రధారి: CID

image

HCA అవకతవకల కేసు వ్యవహారంలో CID దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఐదుగురిని కస్టడీలోకి ఇవ్వాలని మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ వేసింది. వారిని 10 రోజులపాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ‘HCAలో అక్రమాలు జరిగాయి. కమిటీ అధ్యక్షుడు జగన్మోహనే కీలక సూత్రధారి. BCCIతోపాటు IPL నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారు’ అని CID పేర్కొంది. ఈ పిటిషన్‌పై కోర్టు ఇవాళ విచారించనుంది.

Similar News

News August 31, 2025

అంచనాలకు మించి దూసుకెళ్తున్న భారత్

image

భారత ఎకానమీ అంచనాలకు మించి వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌(ఏప్రిల్-జూన్)లో <<17555786>>GDP<<>> వృద్ధి రేటు 7.8% నమోదవడమే ఇందుకు నిదర్శనం. మాన్యుఫాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్, సర్వీస్ సెక్టార్లు రాణించడం కలిసొస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో అతిపెద్ద ఎకానమీగా ఉన్న భారత్ 2030 నాటికి మూడో స్థానానికి చేరుతుందని అధికారులు వెల్లడించారు. అప్పటివరకు జీడీపీ $7.3 ట్రిలియన్లకు చేరుతుందని తెలిపారు.

News August 31, 2025

రేపు రాజంపేటలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. రాజంపేట మండలం, కె.బోయినపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన పంపిణీ చేయనున్నారు. ప్రతి నెల 1న సీఎం వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ నేరుగా పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. రేపటి కార్యక్రమం అనంతరం సాయంత్రం తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.

News August 31, 2025

భారత్‌పై మరో కుట్రకు తెరలేపిన ట్రంప్?

image

50% టారిఫ్స్ అమలు చేస్తూ భారత ఎకానమీని దెబ్బకొట్టాలని చూస్తున్న ట్రంప్ మరో కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. తమలాగే ఇండియాపై టారిఫ్స్ విధించాలని యూరోపియన్ దేశాలకు US సూచించినట్లు సమాచారం. IND నుంచి ఆయిల్, గ్యాస్ కొనుగోళ్లను కూడా పూర్తిగా నిలిపేయాలని చెప్పినట్లు తెలిసింది. ట్రేడ్ డీల్‌కు భారత్ ఒప్పుకోకపోవడం, రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపకపోవడంతో ట్రంప్ అసహనానికి గురై ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం.