News April 1, 2025

ఇవాళ విజిలెన్స్ విచారణకు HCA అధ్యక్షుడు!

image

SRHను వేధించిన ఘటనలో HCA అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు ఇవాళ విజిలెన్స్ విచారణకు హాజరుకానున్నారు. ఆయన విచారణకు రాకపోతే విజిలెన్స్ అధికారులే HCAకు వెళ్లే అవకాశం ఉంది. పాసుల కోసం జగన్‌మోహన్ రావు తమను వేధిస్తున్నాడంటూ ఇటీవల SRH సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

Similar News

News April 2, 2025

ముడా స్కామ్‌లో సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ

image

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) స్కాం కేసులో ED ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కర్ణాటక CM సిద్దరామయ్య నిర్దోషి అంటూ లోకాయుక్త ఇచ్చిన నివేదికను కొట్టివేయాలంటూ సవాల్ చేసింది. ఇందులో ఆయన హస్తం ఉందనడానికి తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. కాగా ఈ కుంభకోణంలో సిద్దరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి, ఇతరుల ప్రమేయం ఉందని గతంలో ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News April 2, 2025

సింగిల్‌గా వస్తోన్న సంగీత్ శోభన్

image

‘మ్యాడ్ స్క్వేర్’తో విజయం అందుకున్న సంగీత్ శోభన్ కొత్త సినిమాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌’పై కొణిదెల నిహారిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా నిహారిక సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకూ మల్టీస్టారర్ మూవీల్లో నటించిన సంగీత్ శోభన్ ఈ చిత్రంతో సోలోగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మానస శర్మ తెరకెక్కించే ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది.

News April 2, 2025

వక్ఫ్ బిల్లుపై అపోహలు సృష్టిస్తున్నారు: అమిత్‌షా

image

వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగబద్ధమేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు మైనార్టీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. వక్ఫ్ బిల్లుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఈ బిల్లుకు మెజార్టీ వర్గాల మద్దతు ఉందని, ఇది తాము చేపట్టిన అతిపెద్ద సంస్కరణ అని లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చలో షా పేర్కొన్నారు.

error: Content is protected !!