News March 31, 2025
SRH ఆరోపణలపై స్పందించిన HCA

SRH, HCA ప్రతిష్ఠను మసకబార్చేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని HCA మండిపడింది. SRH యాజమాన్యం నుంచి తమకు ఎలాంటి ఈమెయిల్స్ రాలేదని తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. కాగా ఉచిత పాస్ల కోసం HCA తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని SRH ఆరోపించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. టికెట్ల విషయంపై HCA అధ్యక్షుడు జగన్ బెదిరించినట్లు సమాచారం.
Similar News
News January 21, 2026
శబరిమల ఆలయం ఎప్పుడు తెరుస్తారంటే?

శబరిమలలో 2నెలలు కొనసాగిన మండల-మకరవిలక్కు ముగియడంతో ఆలయాన్ని అధికారులు మూసేశారు. మళ్లీ ఫిబ్రవరిలో జరగబోయే నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఆలయాన్ని FEB 12 సా.5 గంటలకు తెరుస్తారు. పూజలు 17వ తేదీ రా.10గం.కు వరకు కొనసాగుతాయి. అప్పుడూ భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. గతంలో మాదిరే ఆన్లైన్ బుకింగ్, దర్శన టోకెన్లు కొనసాగుతాయి.
News January 21, 2026
దావోస్లో సీఎం రేవంత్, చిరంజీవి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో తెలంగాణ విజన్ను ప్రదర్శించగా.. ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్, చిరంజీవి, మంత్రులు పక్కపక్కనే కూర్చున్నారు. ఆప్యాయంగా మాట్లాడుకుని కలిసి విందులో పాల్గొన్నారు. అయితే గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు పాల్గొనే ఈ ప్రోగ్రాంకు మెగాస్టార్ ఎందుకు వెళ్లారనే దానిపై క్లారిటీ రాలేదు.
News January 21, 2026
మహిళల్లో షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిని విస్మరించకూడదంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు మధుమేహం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీంతో పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారడం, దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


