News January 14, 2025
భారీగా పతనమైన HCL స్టాక్స్

Q3 ఫలితాలు మెరుగ్గా ఉన్నప్పటికీ దేశంలో మూడో అతిపెద్ద IT దిగ్గజం HCL Technologies షేర్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. గత సెషన్లో స్థిరపడిన ₹1,975 నుంచి ₹1,819 వరకు 8.52% మేర పతనమయ్యాయి. Q3లో ₹4,591 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన సంస్థ గత క్వార్టర్ కంటే 8.5% వృద్ధిని నమోదు చేసింది. ఫలితాలు ఆశించిన మేర లేకపోవడం, కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి.
Similar News
News September 15, 2025
ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు ట్రాన్స్ఫర్ అయ్యారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రిరెడ్డి, ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మ, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల శాఖ ఎండీగా సౌర్యమాన్ పటేల్‌తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా ఐపీఎస్ రాహుల్ శర్మకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
News September 15, 2025
బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.10 కోట్ల దావా

TG: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల దావా పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గతంలో బండికి కేటీఆర్ నోటీసులు పంపారు. అయితే సంజయ్ వాటిపై స్పందించలేదు. దీంతో కేటీఆర్ చట్టపరమైన చర్యలకు దిగారు.
News September 15, 2025
వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలి: సీఎం రేవంత్

TG: రాష్ట్రమంతటా LED వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలన్నారు. అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్ఈడీ లైట్లున్నాయని, అవి పని చేయటంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. అన్ని లైట్లను HYDలోని కమాండ్ కంట్రోల్ సెంటరుతో అనుసంధానం చేయాలని ఆదేశించారు.