News April 12, 2025

HCU భూములపై శ్వేత పత్రం విడుదల చేయాలి: హరీశ్ రావు

image

ప్రభుత్వం HCU భూములపై శ్వేత పత్రం విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. TGIIC ద్వారా 400 ఎకరాలు తనఖా పెట్టి రుణం పొందామని అసెంబ్లీలో తను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పిందని అన్నారు. మరి నేడు ICICI బ్యాంక్ మేము తనఖా పెట్టుకోలేదని చెబుతోందని, ఆ 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిని ప్రభుత్వం ఎవరి వద్ద తనఖా పెట్టినట్లు? అని ప్రశ్నించారు.

Similar News

News April 17, 2026

కాకినాడ జిల్లా ఓటర్ల జాబితా సిద్ధం!

image

పంచాయతీ ఎన్నికల కోసం కాకినాడ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. జిల్లాలోని 385 పంచాయతీల్లో మొత్తం 12,58,456 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. వీరిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. కాకినాడ రూరల్‌లో పెండింగ్‌లో ఉన్న 6 పంచాయతీలతో సహా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. త్వరలోనే తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

News April 17, 2026

బుగ్గారం ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులపై కలెక్టర్ తనిఖీ

image

బుగ్గారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, మండల రెవెన్యూ, మండల ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీ తదితర నూతన భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీఏ పీడీ రఘువరన్, తహసీల్దార్ భూమేశ్వర్, ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో వాసవి, సర్పంచ్ నక్క రాజవ్వ, అధికారులు పాల్గొన్నారు.

News April 17, 2026

పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

image

దేశంలో ప్రతిష్ఠాత్మకమైన పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోందని జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు, ప్రతిభ కనబరిచిన అర్హులైన వ్యక్తులను ఎంపిక చేసి ఈ అవార్డులు అందజేస్తారని తెలిపారు.