News April 2, 2025
HCU భూములు కాపాడండి.. మెదక్ ఎంపీ విజ్ఞప్తి

కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) భూములను విక్రయించడంలో జోక్య చేసుకుని చర్య తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. టీబీజేపీకి చెందిన సహచర ఎంపీలతో కలిసి ఈమేరకు వినతి పత్రం అందజేశారు. ఈ నిర్ణయం విశ్వవిద్యాలయం, విద్యార్థులు, సమాజంపై చాలా విస్తృతమైన పరిణామాలను కలిగిస్తుందన్నారు.
Similar News
News November 28, 2025
వరల్డ్‌లోనే ఎత్తైన శ్రీరాముడి విగ్రహం.. నేడు ప్రారంభించనున్న మోదీ

ద.గోవాలోని శ్రీసంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తమ మఠంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 77అడుగుల శ్రీరాముడి కంచు విగ్రహాన్ని PM మోదీ నేడు సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ రూపకర్త రామ్ సుతార్ తల్పోణ నదీ తీరంలో దీన్ని రూపొందించారు. మఠం స్థాపించి 550ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గోవా గవర్నర్ అశోక్ గాజపతిరాజు, CM ప్రమోద్ సావంత్ విగ్రహ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
News November 28, 2025
సనత్‌నగర్: పదో అంతస్తు నుంచి పడి బీటెక్ విద్యార్థిని మృతి

సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్పతరువు రెసిడెన్సీ అపార్ట్మెంట్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి మృతి చెందింది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 28, 2025
పశువులకు మూతిపుండ్ల వ్యాధి ముప్పు!

AP: ఇటీవల కురిసిన వర్షాల వల్ల పాడి పశువులు మూతి పుండ్ల వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని.. పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సంచాలకులు దామోదర్‌నాయుడు సూచించారు. ఈ వ్యాధి సోకిన పశువుల్లో తీవ్రమైన జ్వరం, నాలుక నీలి రంగులోకి మారడం, నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం, దాణా తీసుకోకపోవడం, నోటి నుంచి చొంగ కారడం, నీరసం, పాల ఉత్పత్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


