News April 2, 2025
HCU భూముల అమ్మకం ఆపాలి: MLC అంజిరెడ్డి

HCU భూముల అమ్మకం నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పట్టభద్రుల MLC అంజిరెడ్డి డిమాండ్ చేశారు. HCU భూముల అమ్మకానికి వ్యతిరేకంగా ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ధర్నాలో అంజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. HCUలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవి హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ సిలిండర్ లాంటిదని అలాంటి భూమి అమ్మడం ద్వారా హైదరాబాద్లో అనేక అనర్థాలు, కాలుష్యాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు.
Similar News
News December 9, 2025
విశాఖలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సీఎం చంద్రబాబు ఈనెల 12న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. మధురువాడ ఐటీ హిల్స్పై సందర్శించిన ఆయన కాగ్నిజెంట్ కంపెనీకి శంకుస్థాపన చేయనున్న ప్రాంతంలో ఏర్పాట్లు ఎక్కడివరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. సీఎం చేరుకోనున్న క్రమంలో అక్కడి హెలిప్యాడ్ను పరిశీలించారు. ఆయన వెంట జేసీతో పాటు ఏపీఐఐసీ అధికారులు ఉన్నారు.
News December 9, 2025
ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్: మంత్రి అనగాని

రెవెన్యూ సమస్యలపై ప్రతి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం సచివాలయంలో తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడానికి సమయం పడుతోందని, రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తిస్థాయి మార్పులతో తప్పులకు ఆస్కారం లేని వ్యవస్థను తీసుకువస్తామన్నారు. రైతులకు త్వరగా పాస్ పుస్తకాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.
News December 9, 2025
విశాఖలో 16 అనధికార, నిర్మాణ భవనాల తొలగింపు

జీవీఎంసీ కమీషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలో విశాఖలో ఆగస్టు 31 తర్వాత నిర్మించిన అనధికార భవనలను తొలగిస్తున్నట్ల జీవీఎంసీ ఛీప్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు తెలిపారు. జోన్-2లో 3, జోన్-3లో 2, జోన్-4లో 3, జోన్-5లో 4, జోన్-6లో 3, జోన్-8లో ఒక నిర్మాణంతో కలిపి మొత్తం 16 అనధికార నిర్మాణాలను రెండు రోజుల నుంచి తొలగించినట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన బీపీఎస్ను వినియోగించుకోవాలన్నారు.


