News April 2, 2025
HCU భూముల అమ్మకం ఆపాలి: MLC అంజిరెడ్డి

HCU భూముల అమ్మకం నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పట్టభద్రుల MLC అంజిరెడ్డి డిమాండ్ చేశారు. HCU భూముల అమ్మకానికి వ్యతిరేకంగా ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ధర్నాలో అంజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. HCUలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవి హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ సిలిండర్ లాంటిదని అలాంటి భూమి అమ్మడం ద్వారా హైదరాబాద్‌లో అనేక అనర్థాలు, కాలుష్యాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు.
Similar News
News April 21, 2025
జర్మన్ యువకుడిని పెళ్లాడిన మంగళగిరి యువతి

మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన మౌనిక జర్మనీలో PHD చేస్తూ ఉద్యోగం చేస్తుంది. అక్కడే పనిచేస్తున్న జర్మన్ యువకుడు ఫాబియన్ డువెన్ బేక్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతో వీరి వివాహం ఆదివారం పెదవడ్లపూడిలో ఘనంగా జరిగింది. మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ దంపతులు వధూవరులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
News April 21, 2025
శ్రీకాకుళం: నేడు ఈ మండలాల్లో రెడ్ అలర్ట్

శ్రీకాకుళం జిల్లాలో నేడు ఈ మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బూర్జ 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత , హిరమండలం 41.4, ఎల్ ఎన్ పేట 41.3, పాతపట్నం 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News April 21, 2025
నంద్యాల: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జోష్య హరిణిరెడ్డి(6) మృతి చెందింది. ఆదివారం ఉదయం కారును బొలెరో ఢీకొనడంతో చిన్నారితోపాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తాడిపత్రి ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపూర్ తీసుకెళ్తుండగా జోష్య మృతి చెందినట్లు కొలిమిగుండ్ల సీఐ మద్దినేని రమేశ్ వెల్లడించారు.