News April 1, 2025
HCU భూముల వ్యవహారం: ప్రజాసంఘాలతో భట్టి సమావేశం

హెచ్సీయూకు సంబంధించి భూముల వ్యవహారంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రజాసంఘాల నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ సూచన మేరకు భూకేటాయింపులకు సంబంధించిన వివరాలను వారికి ఆయన అందజేశారు. అదే విధంగా రద్దు, చదును ప్రక్రియల గురించి వివరించారు. అంతకు ముందు భూముల వివాదంపై సీఎం మంత్రులతో భేటీ అయి చర్చించారు.
Similar News
News April 2, 2025
మూసీ పరిసరాల్లో నిర్మాణాలపై ఆంక్షలు

TG: మూసీ నది పరిసరాల్లో నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మూసీకి 50మీటర్ల వరకు బఫర్జోన్లో నిర్మాణాలు చేపట్టవద్దని, 50-100 మీటర్ల వరకు కొత్త అనుమతులు ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళికరహిత అభివృద్ధి జరగకుండా DTCP, GHMC చీఫ్ ప్లానర్, HMDA ప్లానింగ్ డైరెక్టర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జేఎండీలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
News April 2, 2025
IPL: గుజరాత్ టార్గెట్ 170 రన్స్

GTతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 169-8 స్కోర్ చేసింది. లివింగ్ స్టోన్ (54), జితేశ్ శర్మ (33) రాణించారు. కోహ్లీ (7), సాల్ట్ (14), పడిక్కల్ (4), పాటీదార్ (12) నిరాశపరిచారు. చివర్లో టిమ్ డేవిడ్ (32) మెరుపులు మెరిపించారు. GT బౌలర్లలో సిరాజ్ 3, సాయి కిశోర్ 2 వికెట్లు తీయగా, అర్షద్, ఇషాంత్, ప్రసిద్ధ్ తలో వికెట్ పడగొట్టారు.
News April 2, 2025
లాలూ కోరికను ప్రతిపక్షం తీర్చలేకపోయింది.. మేం తీరుస్తున్నాం: షా

వక్ఫ్ ఆస్తులు లూటీ కాకుండా ఉండేందుకు అత్యంత కఠినమైన చట్టాలు రావాలని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కోరుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో గుర్తుచేశారు. ‘2013లో అప్పటి యూపీఏ సర్కారు సవరణ బిల్లును ప్లాన్ చేస్తే లాలూ స్వాగతించారు. ‘వక్ఫ్ బోర్డులో సభ్యులు చాలా భూముల్ని అమ్మేశారు. సవరణను మేం సమర్థిస్తున్నాం’ అని అన్నారు. ఆయన కోరికను మీరు నెరవేర్చలేదు. మోదీ చేశారు’ అని పేర్కొన్నారు.