News August 14, 2025

మినిమం బ్యాలెన్స్‌‌ను భారీగా పెంచిన HDFC

image

అర్బన్ ఏరియాల్లో నెలవారీ మినిమం బ్యాలెన్స్‌ను రూ.25వేలకు పెంచుతున్నట్లు HDFC ప్రకటించింది. గతంలో ఇది రూ.10వేలుగా ఉండేది. AUG 1 తర్వాత సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి ఇది వర్తిస్తుంది. సెమీ అర్బన్ ఏరియాల్లోనూ రూ.25వేలుగా(గతంలో రూ.5వేలు) నిర్ధారించింది. రూరల్ ప్రాంతాల్లో రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచింది. ఇటీవల ICICI కూడా భారీగా మినిమం బ్యాలెన్స్‌ను పెంచగా తీవ్ర విమర్శలు రావడంతో <<17396156>>వెనక్కి<<>> తగ్గింది.

Similar News

News August 16, 2025

కాసేపట్లో భారీ వర్షాలు: TGiCCC

image

TG: కాసేపట్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ కమాండ్&కంట్రోల్ సెంటర్ హెచ్చరించింది. సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తెల్లవారుజామున 4 గంటల్లోపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ మేరకు ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజులు పంపింది.

News August 16, 2025

ఆగస్టు 16: చరిత్రలో ఈ రోజు

image

1919 : మాజీ సీఎం టంగుటూరి అంజయ్య జననం
1920 : మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి(ఫొటోలో) జననం
1970: మనీషా కొయిరాలా జననం
1989 : సింగర్ శ్రావణ భార్గవి జననం
1996 : వేద పండితులు, గాంధేయవాది చర్ల గణపతిశాస్త్రి మరణం
2001 : భారత భౌతిక, వాతావరణ శాస్త్రవేత్త అన్నా మణి మరణం

News August 16, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.