News July 24, 2024
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన HDFC

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు HDFC ప్రకటించింది. రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్లు అదనంగా వడ్డీ ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో FD ఖాతాదారుల్లో గరిష్ఠంగా సాధారణ పౌరులకు 7.40%, సీనియర్ సిటిజన్లకు 7.90% వడ్డీ లభిస్తుంది. నేటి నుంచే ఈ పెంచిన రేట్లు అమల్లోకి వచ్చినట్లు ఆ బ్యాంకు వివరించింది.
Similar News
News December 5, 2025
మంచి దర్శకుడు దొరికితే CBN బయోపిక్‌లో నటిస్తా: శివరాజ్‌కుమార్

AP: విలువలు కలిగిన రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్‌లో నటించడం గర్వంగా ఉందని కన్నడ హీరో శివరాజ్ కుమార్ తెలిపారు. అలాగే మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు బయోపిక్‌లో ఆయన పాత్ర పోషించడానికి సిద్ధమన్నారు. రామ్‌చరణ్ ‘పెద్ది’ మూవీలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు చెప్పారు. కన్నడ ప్రజల మాదిరిగా తెలుగు ప్రేక్షకులూ తనను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు.
News December 5, 2025
టెంపుళ్ల ఆదాయంపై సుప్రీం కీలక తీర్పు

ఆలయాల ఆదాయం దేవునికి సంబంధించిందని, బ్యాంకుల మనుగడకు ఆ నిధులు వాడుకోరాదని SC స్పష్టం చేసింది. కేరళ తిరునల్వేలి ఆలయ డిపాజిట్లను 2నెలల్లో చెల్లించాలన్న HC తీర్పుపై కొన్ని సహకార బ్యాంకులు వేసిన పిటిషన్‌ను విచారించింది. వెంటనే చెల్లించాలంటే సమస్యలున్నాయని ఆ బ్యాంకులు పేర్కొనగా ‘అది మీ సమస్య’ అంటూ CJI వ్యాఖ్యానించారు. డిపాజిట్‌దారుల్లో నమ్మకం పెంచాలని, టైమ్ పొడిగింపునకు HCని ఆశ్రయించాలని సూచించారు.
News December 5, 2025
అద్దెకు పురుషులు.. ఎక్కడో తెలుసా?

లాత్వియా దేశంలో పురుషుల కొరత కారణంగా మహిళలు “అద్దె” సేవలను వినియోగిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అక్కడ పురుషుల కంటే మహిళలు 15.5% ఎక్కువగా ఉన్నారు. దీంతో ప్లంబింగ్, కార్పెంటరీ, రిపేర్లు, పెయింట్లు వేయడంతో పాటు ఇతర పనులకు గంటల ప్రాతిపదికన మగాళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. అదే విధంగా చాలా మంది పార్ట్‌నర్ కోసం ఇతర దేశాలకు సైతం వెళ్తున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో కూడా ఇలాంటి సేవలు ఉన్నాయి.


