News June 11, 2024
ఇండియా గెలుస్తుందని బెట్టింగ్ వేసి రూ.7.5 కోట్లు గెలిచాడు!

ఫుట్‌బాల్, NFLతో సహా స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో భారీ మొత్తంలో బెట్టింగ్ పెట్టే కెనడియన్ రాపర్ డ్రేక్ మొన్న జరిగిన INDvsPAK మ్యాచ్‌పై ఆసక్తి చూపారు. పాకిస్థాన్‌పై భారత్ గెలుస్తుందని £510,000 పందెం వేసినట్లు డ్రేక్ ఇన్‌స్టాలో వెల్లడించారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందడంతో అతడికి £715,000 (రూ. 7.58 కోట్లు) వచ్చాయని, రూ. 2.16 కోట్ల లాభం పొందినట్లు స్థానిక మీడియా తెలిపింది.
Similar News
News December 6, 2025
MHBD: ఖద్దరే కాదు.. కన్నీటి కష్టం కూడాను!

జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఏ పల్లెకు వెళ్లిన, ఏ ఓటరును కదిలించిన పంచాయతీ ఎన్నికల ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు. ఐతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం గెలుపొందేందుకు ఆస్తులు, బంగారం కుదువపెట్టి మరి రూ.లక్షల్లో ఖర్చులు పెడుతున్నారు. గెలుపొందితే సరేకానీ ఓటమి పాలైతే పరిస్థితి ఏంటని పల్లెల్లో చర్చించుకుంటున్నారు. గెలిస్తే ఖద్దరే కాదు, ఓడితే కన్నీటి కష్టం కూడా ఉంటుందని అనుకుంటున్నారు.
News December 6, 2025
వంటింటి చిట్కాలు

*వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలంటే.. వాటిని పెనం మీద వేసి కొద్దిసేపు వేడి చేయాలి. ఇలా చేస్తే పొట్టు ఈజీగా వస్తుంది.
*కర్రీలో పులుపు మరీ ఎక్కువగా ఉంటే బెల్లం లేదా ఉప్పు కలిపి చూడండి. ఇక్కడ ఉప్పును రుచి చూసి కలుపుకోవాలి.
* కాకరకాయ కూర వండేటప్పుడు కాస్త నిమ్మరసం వేస్తే చేదు తగ్గుతుంది.
* పకోడీలు కరకరలాడుతూ రావాలంటే పిండి కలిపేటప్పుడే ఒక చెంచా మరుగుతున్న నూనె కలపాలి.
News December 6, 2025
7వేల కి.మీ పొడవైన నది.. కానీ బ్రిడ్జిలు ఉండవు!

ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెజాన్ నదిపై వంతెనలు లేవని మీకు తెలుసా? అవును. ఈ నది బ్రెజిల్, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, బొలివియా, వెనిజులా, గయానా, సురినామ్ దేశాల మీదుగా దాదాపు 7వేల కి.మీ ప్రవహిస్తుంది. దీని వెడల్పు 3-10 కి.మీ ఉంటుంది. వర్షాకాలంలో అది 48 కి.మీ వరకు విస్తరిస్తుంది. లోతు 330 అడుగులకు చేరుతుంది. అంతేకాదు అక్కడి మృదువైన నేలల్లో బ్రిడ్జిలు నిర్మించడం చాలా కష్టం. అందుకే బోట్లలో నది దాటుతారు.


