News December 31, 2024

పెళ్లికి అంగీకరించలేదని జిలెటిన్ స్టిక్‌తో పేల్చుకున్నాడు

image

పెళ్లికి ప్రియురాలి ఫ్యామిలీ అంగీక‌రించ‌లేద‌ని ఓ యువ‌కుడు జిలెటిన్ స్టిక్ పేల్చుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. KAలోని మాండ్యకు చెందిన రామ‌చంద్ర‌(21) క‌లేన‌హ‌ళ్లికి చెందిన యువ‌తి ప్రేమించుకున్నారు. గ‌తంలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆమె ఫ్యామిలీ ఫిర్యాదుతో రామచంద్ర 3 నెల‌లు జైలుకెళ్లాడు. విడుద‌ల‌య్యాక కూడా ప్రేమాయ‌ణం సాగించాడు. అయినా పెళ్లికి అంగీకరించలేదని అమ్మాయి ఇంటి ముందు త‌నువు చాలించాడు.

Similar News

News September 15, 2025

ప్రియుడితో నటి ఎంగేజ్‌మెంట్?

image

రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రచిత్‌ సింగ్‌తో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. యాక్టింగ్ కోచ్‌ అయిన రచిత్‌తో హుమా ఏడాదికి పైగా డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పలు సందర్భాల్లో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఈక్రమంలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటిపై హుమా స్పందించాల్సి ఉంది.

News September 15, 2025

ఈనెల 17న విశాఖలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఈనెల 17న విశాఖలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.15AMకి కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఆర్కే బీచ్ రోడ్డులో ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్లో పాల్గొంటారు. 12PMకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌‌లో ప్రసంగిస్తారు. అనంతరం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.

News September 15, 2025

సూపర్-4కు దూసుకెళ్లిన టీమిండియా

image

ఆసియా కప్‌లో టీమిండియా సూపర్-4కు దూసుకెళ్లింది. తాజాగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో UAE ఘన విజయం సాధించడంతో భారత్‌‌కు లైన్ క్లియర్ అయింది. టీమిండియా ఇప్పటికే UAE, పాక్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. మెరుగైన నెట్ రన్‌రేట్(4.793) కారణంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-4కు అర్హత సాధించింది. రెండో బెర్త్ కోసం పాక్, UAE పోటీ పడనున్నాయి.