News October 5, 2024

రూ.121 కోట్లు పెట్టి నంబర్ ప్లేట్ కొన్నాడు! ఎందుకంటే..

image

అబుదాబికి చెందిన వ్యాపారవేత్త సయీద్ 2008లో సుమారు రూ.121 కోట్లు వెచ్చించి ‘1’ అంకె ఉన్న నంబర్ రిజిస్ట్రేషన్‌ చేయించారు. పిచ్చి పని అంటూ అప్పట్లో విమర్శించిన వారే అది తెలివైన పెట్టుబడి అని ఇప్పుడు చెబుతున్నారు. అందుక్కారణం.. సింగిల్ డిజిట్ ప్లేట్స్ UAEలో మొత్తమ్మీద 63 మాత్రమే ఉన్నాయి. అందులోనూ ‘1’ అనేది అక్కడి శ్రీమంతులకి స్టేటస్ సింబల్. నేడు ఉన్న డిమాండ్‌కి ఆ నంబర్ విలువ రూ. 168కోట్లకు పైమాటే!

Similar News

News October 5, 2024

ఫొటో గ్యాలరీ.. హంసవాహనంపై తిరుమలేశుడు

image

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ వేంకటేశ్వరుడు హంసవాహనంపై తిరుమల మాడ వీధుల్లో విహరించారు. సరస్వతీమూర్తి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కనులపండువగా సాగిన మహోత్సవ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.

News October 5, 2024

బంగ్లాతో టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ

image

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన రేపటి నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. దూబే స్థానంలో హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. త్వరలోనే తిలక్ జట్టుతో కలుస్తారని తెలుస్తోంది. కాగా రేపు రాత్రి 7.30 గంటలకు గ్వాలియర్‌లో భారత్, బంగ్లా మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది.

News October 5, 2024

సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. CBN ఆగ్రహం

image

AP: ఉచిత ఇసుకపై సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలంటూ గనులశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ప్రజలను తప్పుదారి పట్టించే దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కావాలనే కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని సీఎం దుయ్యబట్టారు.