News April 7, 2024
వచ్చాడు.. వెళ్లాడు

ముంబై ‘మిస్టర్ 360’ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యారు. మూడు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన అతడు నోకియా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. ఇక ధనాధన్ ఇన్నింగ్స్‌తో బ్యాటింగ్ మొదలు పెట్టిన రోహిత్ శర్మ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 49 రన్స్ చేశారు. హిట్‌మ్యాన్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించిన ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 16, 2026
మేమిచ్చే సన్నబియ్యం పిల్లలకూ పెడుతున్నారు: రేవంత్

TG: గత ప్రభుత్వంలో ఎప్పుడైనా రేషన్ బియ్యం తిన్నారా అని సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ సభలో ప్రశ్నించారు. ‘మేము రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఇస్తున్నాం. గతంలో రేషన్ బియ్యం ఎవరూ తినేవారు కాదు. ఇప్పుడు పిల్లలకు కూడా పెడుతున్నారు. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. రైతులతో పాటు 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News January 16, 2026
ప్రజల కోసమే మోదీని కలుస్తున్నా: CM

TG: తాను అభివృద్ధి కోసం, నిధుల కోసం ఎవరినైనా కలుస్తానని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘నేను పదేపదే ప్రధానిని కలుస్తానని చాలా మంది అంటుంటారు. మోదీ నాకు బంధువు కాదు. ఆయన దేశానికి ప్రధాని. ఎన్నికల వరకే రాజకీయం. ప్రధాని అనుమతిస్తేనే నిధులు వస్తాయి. నాకు పర్సనల్ అజెండా లేదు. గత ప్రభుత్వం పదేళ్లు కేంద్రాన్ని అడగలేదు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. అందుకే మోదీని కలుస్తున్నా’ అని నిర్మల్ సభలో తెలిపారు.
News January 16, 2026
షుగర్ పేషంట్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చా?

డయాబెటిస్ ఉన్నవారు బరువు తగ్గడానికి ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ చేయడం మంచిదే. కానీ జాగ్రత్తలు తప్పనిసరి. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగినా.. సరైన ప్లాన్ లేకపోతే ప్రాణాల మీదకు రావొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు తినకుండా ఉంటే షుగర్ లెవల్స్ పడిపోతాయి. అలాగే ఉపవాసం తర్వాత ఒక్కసారిగా తింటే షుగర్ అదుపు తప్పుతుంది. అందుకే టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు, గర్భిణులు దీనికి దూరంగా ఉండాలి.


