News September 11, 2025
3 బాణాలతో కురుక్షేత్రాన్ని ముగించగలడు!

భీముని మనవడు, ఘటోత్కచుని కుమారుడు ‘బార్బరీకుడు’. ఈయన మహాభారత సంగ్రామంలో పాల్గొందామని అనుకుంటాడు. కేవలం 3 బాణాలతోనే యుద్ధాన్ని ముగించగల ప్రతిభ ఆయన సొంతం. కానీ, శ్రీకృష్ణుడు బార్బరీకుణ్ని అడ్డుకుంటాడు. ఆయన రణరంగంలో దిగితే యుద్ధం ఏకపక్షం అవుతుందని గ్రహిస్తాడు. యుద్ధంలో ఎవరూ మిగలరని భావించి శ్రీకృష్ణుడు ఆయన తలను దానంగా అడుగుతాడు. అనంతరం కలియుగంలో ‘శ్యామ్ బాబా’గా పూజలందుకుంటావని వరం ఇస్తాడు.
Similar News
News September 11, 2025
పెండింగ్‌లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు

TG: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉందని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. స్థానిక ఎన్నికల్లో 50శాతం క్యాప్ ఎత్తేస్తూ ప్రభుత్వం పంపిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ జారీ చేసిన మెమోతో ఈ గందరగోళం నెలకొంది.
News September 11, 2025
ఇలా ఉంటే మీ డిప్రెషన్ తొలగుతుంది!

ప్రస్తుతం చాలా మందిలో డిప్రెషన్, అసూయ, అభద్రతా భావం నెలకొంటోంది. అయితే వీటిని ఎలా అధిగమించాలో తెలపాలని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మానసిక వైద్యుడు శ్రీకాంత్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘మనకున్నది కోల్పోతే అది దిగులు. మనకులేనిది పక్కోడికి ఉంటే అది అసూయ. మనకున్నది పోతుంది అనుకుంటే ఆందోళన. అదే మనకేమీ లేదనుకుంటే ఇలాంటి సమస్యలేవీ ఉండవు’ అని ఆయన తెలిపారు. దీనిపై మీ కామెంట్?
News September 11, 2025
ఐశ్వర్యారాయ్ AI ఫొటోస్ తొలగించండి: ఢిల్లీ HC

ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన పేరు, AI మార్ఫ్‌డ్ ఫొటోస్‌ను అడల్ట్ సైట్స్‌లో వాడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కోర్టు 72 గంటల్లో సంబంధిత సైట్స్, URLsను తొలగించి సదరు ఆపరేటర్ల వివరాలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఇది ఆమె పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగిస్తుందని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని వ్యాఖ్యానించింది.