News September 9, 2024

కాటేసిన పాము కోసం వెతికి చనిపోయాడు

image

AP: కాటేసిన పామును చంపాకే చికిత్స చేయించుకోవాలనుకున్న వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు ANUలో బర్మాకు చెందిన కొండన్న(38) ఎంఏ బుద్ధిజం చదువుతున్నారు. శనివారం పుట్టగొడుగులు కోస్తుండగా రక్తపింజరి కాటేసింది. రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు దాని కోసం వెతికి దొరకడంతో చంపేశాడు. ఆ తర్వాత మంగళగిరి NRI ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్లు చికిత్స ప్రారంభించారు. అప్పటికే ఆలస్యం కావడంతో కొండన్న చనిపోయాడు.

Similar News

News November 25, 2025

మళ్లీ ప్రకాశంలోకి అద్దంకి నియోజకవర్గం?

image

బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం ప్రకాశంలోని కలవనున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్న అద్దంకి పరిపాలన దృష్ట్యా బాపట్లలో చేర్చారు. ప్రస్తుతం జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా అద్దంకిని ప్రకాశంలో కలిపి, రెవెన్యూ డివిజన్‌గా మార్చేందకు ఉపసంఘం ప్రతిపాదించింది. నిన్న అమరావతిలో జరిగిన సమీక్షలో ఈ నివేదికను సీఎం చంద్రబాబుకు అందించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం

News November 25, 2025

దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు.. వచ్చే నెల 3న ఏర్పాటు

image

TG: రాష్ట్రంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. గత నెలలో గ్రామాల్లో మహిళా సమాఖ్యల ద్వారా లక్షన్నర మంది దివ్యాంగ మహిళలు, పురుషులను సెర్ప్‌ గుర్తించింది. మహిళల అధ్యక్షతన ఒక్కో స్వయం సహాయక సంఘంలో 5 నుంచి 10 మంది వరకు సభ్యులు ఉండాలని నిర్దేశించింది.

News November 25, 2025

పీరియడ్స్ రావట్లేదా..? అయితే జాగ్రత్త

image

కొంతమందికి ప్రతినెలా పీరియడ్స్ రావు. దానికి వ్యాధులు, తీవ్ర ఒత్తిడి, అనారోగ్యం, బరువు హఠాత్తుగా పెరగడం లేదా తగ్గడం వంటివి కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఏ కారణంతో పీరియడ్స్ రావడం లేదో వైద్యులను సంప్రదించి తెలుసుకోవడం చాలా అవసరం. పీరియడ్స్ మీ ఆరోగ్య స్థితికి అద్దంపడతాయి. కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఏదో అంతర్లీన సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే తగిన వైద్యం తీసుకోవడం చాలా ముఖ్యం.