News November 10, 2024

114 ఏళ్ల క్రితమే సీప్లేన్ నడిపారు: జగన్

image

చంద్రబాబు సీప్లేన్‌పై కహానీలు మొదలుపెట్టారని YS జగన్ విమర్శించారు. సీప్లేన్ ఇప్పటిది కాదని 114 ఏళ్ల క్రితమే 1910లో నడిచిందని తెలిపారు. ‘గుజరాత్, కేరళల్లో ఇప్పటికే నడిపి ఆపేశారు. దీన్ని అభివృద్ధికి ప్రమాణంగా చెప్పుకోవడం డప్పాలు కొట్టుకోవడం కాదా? మేం రూ.8,480 కోట్లతో వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. 14 మెడికల్ కాలేజీలు కట్టాం. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు నిర్మించాం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 18, 2026

యాదాద్రి: తప్పని సరిగా హాజరు కావాలి: కలెక్టర్

image

పంచాయతీ శాఖ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని సర్పంచులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. నిర్ణీత తేదీల్లో సర్పంచులందరూ తప్పనిసరిగా హాజరై శిక్షణను విజయవంతం చేయాలని ఆదేశించారు. పాలనపై అవగాహన పెంచుకుని గ్రామాల్లో మెరుగైన సేవలందించేందుకే ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News January 18, 2026

AUS టూర్‌కు మహిళల ODI, T20 టీమ్స్ ఇవే

image

FEB 15-MAR 1 మధ్య జరగనున్న టీమ్ ఇండియా ఉమెన్స్ AUS పర్యటనకు సంబంధిచి BCCI జట్లు ప్రకటించింది.
T20: హర్మన్(C), స్మృతి, రేణుక, శ్రీ చరణి, వైష్ణవి, క్రాంతి, స్నేహ్ రాణా, దీప్తి, రిచా ఘోష్, కమలిని, అరుంధతి, అమన్‌జోత్, జెమీమా, ఫుల్మాలీ, శ్రేయాంక.
ODI: హర్మన్(C), స్మృతి, షెఫాలీ, రేణుక, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి, స్నేహ్ రాణా, దీప్తి, రిచా ఘోష్, కమలిని, కష్వీ గౌతమ్, అమన్‌జోత్, జెమీమా, హర్లీన్.

News January 18, 2026

జనవరి 18: చరిత్రలో ఈరోజు

image

* 1881: సంఘ సంస్కర్త, భాషావేత్త నాళం కృష్ణారావు జననం * 1927: ప్రముఖ సంగీత విద్వాంసుడు, దర్శకుడు సుందరం బాలచందర్ జననం * 1972: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ జననం * 1975: సినీ నటి మోనికా బేడి జననం * 1978: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అపర్ణా పోపట్ జననం * 1996: సినీ నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ మరణం (ఫోటోలో) * 2003: హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ మరణం