News April 17, 2024

ముద్దులు పెట్టాడు.. బుగ్గలు నిమిరాడు: చంద్రబాబు

image

AP: అధికారం కోసం జగన్ ముద్దులు పెట్టాడు.. బుగ్గలు నిమిరాడని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుద్దుడే గుద్దుడు అని విమర్శించారు. ‘జగన్ మళ్లీ మరో నాటకం ఆడుతున్నారు. గులక రాయి అంటూ డ్రామాలాడుతున్నారు. రాష్ట్రంలో జగనాసుర వధ జరిపి.. రామరాజ్యం స్థాపిస్తాం. సర్వేలన్నీ కూటమి గెలుస్తుందని చెబుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 16, 2025

త్రివిక్రమ్.. కెరీర్‌లో తొలిసారి!

image

త్రివిక్రమ్ తన జోనర్ మార్చినట్లు టీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సరదా సినిమాలతో సందడి చేసే ఆయన కెరీర్‌లో తొలిసారి థ్రిల్లర్‌ కథను ఎంచుకున్నారని చెబుతున్నాయి. వెంకటేశ్‌-త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’ అనే మూవీ పట్టాలెక్కగా ఇటీవల పోస్టర్ సైతం విడుదలైంది. ఈ చిత్రం క్యాప్షన్ AK47 ఫాంట్ స్టైల్ రక్తపు మరకలతో ఉండటం చూస్తే థ్రిల్లర్‌ మూవీగా స్పష్టమవుతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News December 16, 2025

AP-RCET ఫలితాలు విడుదల

image

పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే AP-RCET(రీసెర్చ్ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో గత నెల నవంబరులో పరీక్షలు జరిగాయి. మొత్తం 65 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించగా, 5,164 మంది ఎగ్జామ్స్ రాశారు. వారిలో 2,859 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఏపీ ఆర్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.ఉష తెలిపారు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

News December 16, 2025

బరువు తగ్గినప్పుడు ఫ్యాట్ బయటికెలా వెళ్తుంది?

image

శరీరంలో కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ రూపంలో నిల్వ ఉంటుంది. డైట్, వ్యాయమం వల్ల కేలరీలు తగ్గించినప్పుడు శరీరం ఆ కొవ్వును ఆక్సిడైజ్ చేసి శక్తిగా మారుస్తుంది. ఈ ప్రక్రియలో ఫ్యాట్ కరిగి కార్బన్ డై ఆక్సైడ్, నీరుగా విడిపోతుంది. 84% కార్బన్ డై ఆక్సైడ్‌గా మారి ఊపిరితో, 16% నీరుగా మారి చెమట, యూరిన్ ద్వారా బయటకు వెళ్తాయి. ఉదా. 10కిలోల ఫ్యాట్ తగ్గితే 8.4KGలు C02గా ఊపిరి ద్వారా, 1.6KGలు నీరుగా విసర్జింపబడతాయి.