News May 14, 2024
ఆయన వల్లే డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన

తాను డిప్రెషన్ నుంచి బయటపడటానికి భర్త రామ్ చరణ్ సాయం చేసినట్లు ఉపాసన చెప్పారు. డెలివరీ తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తల్లి కావడమన్నది ప్రతి మహిళకు అద్భుతమైన ప్రయాణమన్నారు. చాలా మందిలాగే డెలివరీ తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని.. ఆ సమయంలో చరణ్ బెస్ట్ థెరపిస్ట్‌లా వ్యవహరించారని పేర్కొన్నారు. క్లీంకారకు జన్మనిచ్చాక తన జీవితం ఎంతో మారిందని చెప్పుకొచ్చారు.
Similar News
News March 3, 2026
RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News March 3, 2026
అమెరికా భూభాగంపై ఇరాన్ ఎందుకు దాడి చేయట్లేదు?

టెహ్రాన్ నుంచి USA తూర్పు తీరం దాదాపు 10వేల KM దూరంలో ఉంది. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు 2,000-2,500 KM మాత్రమే వెళ్తాయి. అందుకే ఇరాన్ అమెరికా భూభాగంపై కాకుండా ఇజ్రాయెల్, గల్ఫ్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌లపై దాడి చేస్తోంది. కానీ అమెరికా దగ్గర ఖండాంతర క్షిపణులు (ICBM) ఉన్నాయి. ఇవి 13వేల KM ప్రయాణించగలవు. గంటకు 28వేల KM వేగంతో దూసుకెళ్తాయి. అలాగే B-2, B-52 బాంబర్లు US అమ్ములపొదిలో ఉన్నాయి.
News March 3, 2026
నిన్న రక్షణ మంత్రిగా బాధ్యతలు.. ఇవాళ..

ఇరాన్ ప్రభుత్వంలోని కీలక నేతలను ఇజ్రాయెల్ వరుసగా చంపుతోంది. IDF దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి మజీద్ ఇబిన్ అల్ రెజా మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. మంత్రిగా రెజా నిన్ననే బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ <<19266671>>అటాక్‌లో<<>> రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే చనిపోయారు. ఆయన స్థానంలో నియమితులైన రెజా కూడా మృతి చెందారు.


