News August 23, 2024
13 ఏళ్లుగా అతను భార్య కోసం వెతుకుతున్నాడు

సునామీలో కొట్టుకుపోయిన భార్య కోసం ఓ వ్యక్తి గత 13 ఏళ్లుగా సముద్రాన్ని జల్లెడపడుతున్నాడు. జపాన్‌కు చెందిన యసువో తకమట్సు భార్య యుకో 2011 జపాన్ సునామీలో కొట్టుకుపోయింది. భార్య అవశేషాలు ఇక దొరకవని తెలిసినా ఆమె మీద ప్రేమతో అలుపెరగని అన్వేషణ చేస్తూనే ఉన్నాడు. డీప్ డైవర్స్ ద్వారా ఈతలో శిక్షణ పొంది మరీ తన వెతుకులాటను కొనసాగిస్తుండడంతో అందరూ అతనిపై సానుభూతిని ప్రకటిస్తున్నారు.
Similar News
News April 3, 2026
VKB: కవిత పార్టీలో చేరనున్న MLAలు ఎవరు..?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈనెల 25న హైదరాబాద్లో తన కొత్త పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీలోకి ఎమ్మెల్యేలతో సహా పలువురు నేతలు చేరుతారని కవిత చేసిన వ్యాఖ్యలు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే MLAలు కొత్త పార్టీలో చేరతారనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయానికి చేరతారని కొందరు అంటున్నారు.
News April 3, 2026
బంగారం, వెండి లేవు.. 10 కేసులున్నాయి: అఫిడవిట్‌లో ఉదయనిధి

తనకు ₹20.64 కోట్ల ఆస్తి ఉందని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. అయితే తన వద్ద ఎలాంటి బంగారు, వెండి ఆభరణాలు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య పేరిట ₹13.25 కోట్ల అసెట్స్ ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 10 కేసులు ఉన్నాయని చెప్పారు. చెన్నైలోని చెపాక్-తిరువల్లికేణి డీఎంకే అభ్యర్థిగా ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
News April 3, 2026
స్పెషలిస్ట్ డాక్టర్ల గురించి తెలుసా?

*లివర్ (కాలేయం)- హెపటాలజిస్ట్
*మూత్రపిండాలు- నెఫ్రాలజిస్ట్
*క్యాన్సర్- ఆంకాలజిస్ట్
*చెవులు- ఒటోలరింగాలజిస్ట్
*ఊపిరితిత్తులు- పల్మనాలజిస్ట్
*జంతువులు- వెటర్నేరియన్
*కడుపు- గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్


