News October 10, 2024

ఆయనో గొప్ప మానవతా మూర్తి: ప్రధాని

image

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా విజనరీ వ్యాపారవేత్త అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. టాటా మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఆయన దేశంలోనే పురాతనమైన, ప్రతిష్ఠాత్మకమైన వ్యాపార సంస్థకు స్థిరమైన నాయకత్వం అందించారన్నారు. ఆయన గొప్ప మానవతా మూర్తి అని, విద్య, వైద్య, పారిశుద్ధ్యం, జంతు సంరక్షణ కోసం కృషి చేశారని చెప్పారు. దేశం ఒక ఐకాన్‌ను కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు.

Similar News

News October 10, 2024

పావురాలు వదులుతాడు.. చోరీ చేస్తాడు!

image

బెంగళూరుకు చెందిన మంజునాథ్(38)కు పావురాల్ని పెంచడం హాబీ. పగటిపూట జనం ఆఫీసులకు, ఊళ్లకు వెళ్లిన టైమ్‌లో వాటితో వీధుల్లో తిరుగుతూ ఇళ్ల మీదకు వదులుతుంటాడు. తిరిగి పట్టుకునే వంకతో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీ చేస్తాడు. ఆలోపు ఎవరికైనా అనుమానం వచ్చి ప్రశ్నిస్తే తన పావురాల కోసం వచ్చానని చెప్పి తప్పించుకుంటాడు. ఇలా 50 ఇళ్లలో చోరీలు చేశాడు. ఎట్టకేలకు తాజాగా పోలీసులకు చిక్కాడు.

News October 10, 2024

టాటా మృతి పట్ల ప్రముఖ వ్యాపారవేత్తల సంతాపం

image

దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాపారవేత్తలు హర్ష గోయెంకా, ఆనంద్ మహీంద్రా, గౌతమ్ ఆదానీ ట్వీట్లు చేశారు. టాటా ఇకపై లేరన్న విషయాన్ని తాను స్వీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దేశం దిశను పునర్నిర్వచించిన గొప్ప వ్యక్తిని భారత్ కోల్పోయిందని అదానీ ట్వీట్ చేశారు. వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన టాటా ఇక లేరని హర్ష గోయెంకా పేర్కొన్నారు.

News October 10, 2024

రతన్ టాటా మృతి పట్ల కేంద్రమంత్రులు, రాహుల్ సంతాపం

image

దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతి పట్ల కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా, పియూష్ గోయల్ సంతాపం తెలియజేశారు. ఇండియా ఇండస్ట్రీకి రతన్ టాటా టైటాన్ అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. టాటా నిజమైన దేశభక్తుడని అమిత్ షా పేర్కొన్నారు. పరిశ్రమలకు రతన్ చేసిన కృషి మన దేశంతో పాటు ప్రపంచంపై చెరగని ముద్ర వేసిందని నడ్డా తెలిపారు. రతన్ కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి రాహుల్ గాంధీ సంతాపం తెలియజేశారు.