News March 28, 2024

ఇతడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కు ఆదర్శం

image

చాలామంది ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగం రాకపోతే డిప్రెషన్‌లోకి వెళతారు. అలాంటి వారికి గోవాకు చెందిన లిండన్ కార్డొసో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంజినీరింగ్ చదివిన లిండన్ 2013లో హాస్టల్‌లో వాటర్ హీటర్ వేస్తుండగా కరెంట్ షాక్‌ తగిలి చేతులు కోల్పోయారు. 3నెలలు ఆసుపత్రి బెడ్‌పైనే ఉన్నారు. కట్ చేస్తే.. ఇటీవల GSPC ఎగ్జామ్ క్లియర్ చేసి డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్‌లో డి.డైరెక్టర్‌గా అయ్యారు.

Similar News

News January 9, 2026

వెనిజులాపై మరో దాడి అక్కర్లేదు: ట్రంప్

image

వెనిజులాలో పొలిటికల్ ప్రిజనర్స్‌ను విడుదల చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు. ‘వాళ్లు శాంతిని కాంక్షిస్తున్నారన్న విషయం అర్థమవుతోంది. ఆయిల్, గ్యాస్ స్ట్రక్చర్‌ను రీబిల్ట్ చేయడంలో US, వెనిజులా కలిసి పనిచేస్తున్నాయి. ఈ సహకారం వల్లే నేను గతంలో ప్లాన్ చేసిన రెండో దఫా దాడులను రద్దు చేశాను. దాని అవసరం రాదు. కానీ రక్షణ కోసం అన్ని నౌకలు అక్కడే ఉంటాయి’ అని తెలిపారు.

News January 9, 2026

బొగ్గు స్కాంలో అమిత్ షా.. నా దగ్గర పెన్ డ్రైవ్‌లు ఉన్నాయి: మమత

image

బొగ్గు కుంభకోణం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కేంద్ర మంత్రి అమిత్ షాకే వెళ్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తన ప్రభుత్వంపై స్థాయికి మించి ఒత్తిడి చేస్తే అన్నింటినీ బయటపెడతానని హెచ్చరించారు. ‘కోల్ స్కాంలో షా ప్రమేయం ఉంది. నా దగ్గర పెన్ డ్రైవ్‌లు ఉన్నాయి. సీఎం కుర్చీపై ఉన్న గౌరవంతో మౌనంగా ఉన్నా. నేను వివరాలు బయటపెడితే దేశం షేక్ అవుతుంది. ఒక పాయింట్ వరకే దేన్నైనా సహిస్తా’ అని హెచ్చరించారు.

News January 9, 2026

ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా: భట్టి

image

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఇందుకోసం ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిశాయన్నారు. ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్‌కో, SPDCL, NPDCL, జెన్కో ఉద్యోగులకు రూ.కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.