News December 8, 2024
‘అతడు’ స్టైల్ దొంగ.. DNA టెస్టులో దొరికేశాడు!

రాజు అనే ఘరానా <<14738630>>దొంగ<<>> ‘అతడు’ మూవీలో మహేశ్‌బాబు లాగా కుమారుడు తప్పిపోయిన ఇంటికి వెళ్తాడు. ఆపై తనదైన శైలిలో దోపిడి చేసి పరారవుతాడు. ఇలా రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లోని ఇళ్లలో దొంగతనాలు చేశాడు. ఇటీవల ఢిల్లీలోని ఖోడా ఏరియాకు చెందిన తులారాం ఇంటికి అలాగే వెళ్లాడు. ఆస్తులపై కుటుంబీకులను ఆరా తీయగా వారు అనుమానించి పోలీసులకు చెప్పారు. DNA టెస్టులో తులారాంకు సంబంధం లేదని తేలడంతో అరెస్ట్ చేశారు.
Similar News
News November 16, 2025
హెల్తీ హ్యాపీ సొసైటీ స్థాపనే రాజ్యాంగ లక్ష్యం: సీఎం

AP: సోషల్ మీడియాను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దానిపై నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. హెల్తీ హ్యాపీ సొసైటీ స్థాపనే రాజ్యాంగ లక్ష్యమన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75ఏళ్లయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాబోయే రోజుల్లో భారత్ అన్ని రంగాల్లో నిపుణులను అందిస్తుందని, 2047 కల్లా ప్రపంచంలోనే ప్రభావవంతమైన దేశంగా మారుతుందని చెప్పారు.
News November 16, 2025
గురక గాఢనిద్రకు సంకేతం కాదు: వైద్యులు

చాలా మంది గురకను గాఢనిద్రకు సంకేతంగా భావిస్తారు. కానీ అందులో నిజం లేదంటున్నారు వైద్యులు. ‘గురక అనేది గొంతులో గాలి వెళ్లే దారి ఇరుకై శ్వాసకు అడ్డంకులు ఏర్పడటం వల్ల వస్తుంది. దీని వలన నిద్రలో అంతరాయం ఏర్పడి గాఢనిద్ర పట్టదు. తరచుగా గురక వస్తున్నట్లయితే అది స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు’ అని చెబుతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా ఎక్కువగా గురక పెడితే వైద్యుడిని సంప్రదించండి.
News November 16, 2025
టీమ్ ఇండియా చెత్త రికార్డు

SAతో తొలి టెస్టులో టీమ్ ఇండియా చెత్త రికార్డు నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో IND ఛేదించలేకపోయిన రెండో అత్యల్ప స్కోర్ (124) ఇదే. 1997లో బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచులో వెస్టిండీస్‌పై 120 పరుగులను ఛేజ్ చేయలేకపోయింది. ఇప్పుడు దాదాపు 28 ఏళ్ల తర్వాత రెండో లోయెస్ట్ టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమైంది. అటు టెస్టుల్లో SA డిఫెండ్ చేసుకున్న రెండో అత్యల్ప టార్గెట్ ఇదే కావడం గమనార్హం.


